పథకాలకు నిధులన్నీ కేంద్రానివే… నిధుల దారిమళ్లించి దోచుకునే నీచుడు కేసీఆర్
ఊటీ చేస్తానని వికారాబాద్ ను లూటీ చేసిన బడా చోర్
అధికారంలోకొస్తే వికారాబాద్ ను అనంతగిరి జిల్లాగా మారుస్తాం
కాంగ్రెస్, టీఆర్ఎస్ మాదిరిగానే బీజేపీ సీల్డ్ కవర్ పార్టీ కాదు
వికారాబాద్ జిల్లాకు ఎవరేం చేశారో వివరాలివిగో….
వికారాబాద్ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఉద్వేగ భరిత ప్రసంగం
ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి పలు కోర్కెలు కోరిన కేసీఆర్ ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను ఎందుకు బయటపెట్డం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ కేంద్రం ఇచ్చిన నిధులతోనే నడుస్తున్నాయని చెప్పారు. కేంద్ర నిధులను దారిమళ్లించి దోచుకుంటున్న నీచుడు కేసీఆర్ అని దుయ్యబట్టారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 8వ రోజు వికారాబాద్ లో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి పాదయాత్ర చేసిన బండి సంజయ్ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వికారాబాద్ పట్టణంలోని బాబూ జగ్జీవన్ రాం విగ్రహం వద్ద హాజరైన వేలాది జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ మాతా కీ జై….జై శ్రీరాం….అని సంజయ్ ప్రసంగం ప్రారంభిస్తుండగా…‘‘కాబోయే సీఎం బండి సంజయ్’’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేయడంతో సంజయ్ స్పందిస్తూ ‘‘సీఎం కావడానికి మాది కాంగ్రెస్ పార్టీ కాదు. మనది మోదీ, అమిత్ షా, నడ్డా గారి పార్టీ. మనది కుటుంబ, సీల్డ్ కవర్ పార్టీ కాదు. క్రమశిక్షణ కలిగిన పార్టీ. మనకెందుకున్న సీఎం పదవి. ‘బండి సంజయ్….తెలంగాణలో దుమ్ము దుమ్ము చెయ్. బాగా కొట్లాడు. నయా నిజాం పాలనను, నియంత, అవినీతి పాలనను తరిమికొట్టి బీజేపీకి అధికారం కట్టబెట్టు అని చెప్పిండ్రు. అదే నా పని. నాకెందుకన్న సీఎం పదవి’’అని వ్యాఖ్యానించారు. అనంతరం తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఆ ప్రసంగం పూర్తి పాఠం వివరాలిలా ఉన్నాయి…
ఎక్కడ జైశ్రీరాం అనాలో, ఎక్కడ కాషాయ జెండా పెట్టాలో అక్కడే ఎగిరేసినం. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా ఎవరిని ఎక్కడ పెట్టాలో మోదీగారికి తెలుసు. వాళ్లనే అక్కడే పెట్టిండు. పాతబస్తీకి మోదీకి రావాలని ఒవైసీ సవాల్ చేస్తే మనం ఊకుంటమా? పోయి జెండా ఎగరేయలేదా?
మరి ఒవైసీ సవాల్ చేస్తే కేసీఆర్ ఎందుకు పోలేదు. ఆయనలో హిందూ రక్తం ప్రవహించడం లేదా? ఆయన్ ప్యూర్ హిందువు కాదా? బీజేపీలో ప్యూర్ హిందూ రక్తం ప్రవహిస్తోంది.
వికారాబాద్ కు వస్తే సంతోషంగా ఉంది. ఈ ప్రాంతం మహిమాన్విత అనంత పద్మనాభస్వామి పాదాల చెంత దివ్వ ఆశీస్సులు ఈ భూమి. ఇది మార్కండేయ మహర్షి వెయ్యేళ్లు తపస్పు చేసిన తపోభూమి. ఇది ముచ్కుంద నది పుట్టిన పవిత్ర భూమి. రాకంచర్ల వెంకటదాసు కీర్తనలతో ప్రతిధ్వనించిన భూమి. తాండూరు భావిగి భద్రేశ్వర స్వామి వెలసిన పుణ్యభూమి. కొడంగల్ వెంకటేశ్వరస్వామి నిత్య పూజలతో స్వామివారి ఆశీస్సులు పొందుతున్న భూమి. ఇంతటి పవిత్ర శక్తివంతమైన వికారాబాద్ గడ్డమీద మాట్లాడే అవకాశమొచ్చినందుకు అద్రుష్టంగా భావిస్తున్నాను. వికారాబాద్ ను అనంతగిరి జిల్లాగా పేరు మార్చుతాం. బీజేపీ ప్రభుత్వం రాగానే అనంతగిరి జిల్లాగా ప్రకటిస్తాం.
తెలంగాణ కోసం కొట్లాడాలని మాజీమంత్రి చంద్రశేఖర్ చెబుతూ నాకు మొదటి నుండి అండగా ఉన్నడు. కేసీఆర్ కు చంద్రశేఖర్ అన్న ఎంతో సేవ చేసిండు. అమరవీరుల త్యాగాలు కళ్లారా చూసిండు. వారి ఆశయాలు బీజేపీతోనే సాధ్యమైతదని కొట్లాడమని చెప్పిండు.
నా పాదయాత్ర కోసం అహర్నిశలు కష్టపడుతూ విజయవంతం చేస్తున్న పాదయాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి బ్రందానికి నా అభినందనలు.
బీజేపీ-టీఆర్ఎస్ ఒక్కటేనని కొందరు దుష్పచారం చేస్తుండ్రు. నిజంగా మీరే చెప్పండి….. బీజేపీ, టీఆర్ఎస్ ఒకటైతే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎందుకు బీజేపీ గెలుస్తది. దుబ్బాకలో ఎందుకు గెలిచినం. బీజేపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైనా టీఆర్ఎస్ లోకి పోయిండ్రు. టీఆర్ఎస్ గడీలను, ఎంఐఎం గడీలను బద్దలు కొట్టి తరిమితరిమి కొట్టే పార్టీ ఏది? బీజేపీ కదా….మరి టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి ఎట్లయితది? గతంలో టీఆర్ఎస్ తో కాంగ్రెస్, ఎంఐఎం, టీడీపీ, కమ్యూనిస్టులు కూడా కలిసి పోటీ చేసినయ్. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుని పనిచేస్తున్నరో మీరే ఆలోచించండి.
కేసీఆర్ ఎంగిలి మెతుకులు తినే నాయకులు కొందరు ఇక్కడున్నరు. బీజేపీ దమ్మున్న పార్టీ. దేశం, రాష్ట్రం కోసం, అనంతగిరి జిల్లా కోసం కష్టపడి పనిచేసే పార్టీ. అందరి కోసం కష్టపడి యుద్దం చేస్తుంటే లాఠీలతో కొడుతున్నరు. అరెస్టులు చేస్తున్నరు. జైళ్లకు పంపుతున్నరు. అయినా భయపడతమా? భయపడే ప్రసక్తే లేదు.
ఓ తాత వచ్చి వికారాబాద్ కు ఉప ఎన్నిక వస్తదా? అని అడుగుతుండ్రు. ఉప ఎన్నిక వస్తే దళిత బంధు వస్తదని అనుకుంటున్నరు. ఉప ఎన్నిక వస్తేనే కేసీఆర్ బయటకు వస్తడు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. పోయే సీఎంకు పథకాల హామీలు ఎక్కువ.
నేను నిన్న మన్నెగూడలో కేసీఆర్ గురించి చెప్పిన. పదేపదే వెంటబడితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కేసీఆర్ కు అపాయిట్ మెంట్ ఇచ్చిండు. కానీ ప్రధాని వద్దకు వంగి వంగి దండాలు పెట్టిన కేసీఆర్ …ఈసారి కోతలు కోస్తే విడిచి పెట్టే ప్రసక్తే లేదు. మోదీగారిని 50 నిమిషాలు కలిసిండని చెబుతుండు. కానీ అంత సమయం ఇస్తడా? సరే…కలిసినవ్. రాష్ట్రంలో నువ్వెందుకు లీడర్లకు అపాయిట్ మెంట్ ఇస్తలేవు?
ప్రధానిని కలిసి చాలా అడిగినని చెప్పినవ్ కదా….మరి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు ఎందుకు చెప్పడం లేదు? టాయిలెట్లుసహా అన్ని పథకాలకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు చెప్పకుండా…. ఇఛ్చిన నిధులను దారిమళ్లించు దోచుకున్న నీచుడివి నీవు. రోడ్లు, మొక్కలు, రైతు వేదికలు, ఉచిత బియ్యం, ఫ్రీ వ్యాక్సిన్ సహా చివరకు స్మశానవాటికలకూ డబ్బులు కేంద్రం ఇఛ్చినవే కదా….ఆ విషయాలెందుకు ప్రజలకు చెప్పడం లేదు?
చివరకు ఇక్కడ అప్పా జంక్షన్ నుండి రాయచూర్ కు వెళ్లాలంటే ఐదారు గంటలు పడుతోంది. ల్యాండ్ సేకరించి ఇస్తే ఇప్పటికే హైవే అయ్యేది. కానీ ఇవేమీ చేయకుండా కేంద్రంపై విమర్శలు చేస్తుండటం సిగ్గుచేటు.
ఇక్కడున్న నాయకులు, పార్టీ ఫిరాయించిన నాయకులు చెప్పాలి…..తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం 2.43 లక్షల ఇండ్లు ఇచ్చింది. మరి మీ జిల్లాకు ఈ సీఎం ఎన్ని డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారో చెప్పమని టీఆర్ఎస్ నాయకులను నిలదీయండి మరుగుదొడ్లు సహా అన్నింటికీ నిధులిస్తోంది కేంద్రమే. కానీ వాటిని టీఆర్ఎస్ పథకాలుగా చిత్రీకరిస్తున్నరు. ప్రజల సమస్యలు తెలుసుకుని…ఈ విషయాలు ప్రజలతో పంచుకోవడానికే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నం.
ఇవాళ సబ్సిడీలు ఎత్తేసిండు. యూరియా ఫ్రీ అన్నడు. ఎత్తేసిండు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు లేక ఇబ్బంది పడుతున్నడు. తాండూర్ అంటే…షాబాద్ బండలకు ఫేమస్ కానీ ఈ సీఎం ఇక్కడి కార్మికులను ఆదుకోవడం లేదు. ఎందుకంటే సీఎం కుటుంబమంతా గ్రానైట్ పేరిట దోపిడీ చేస్తోంది. అనంతగిరి జిల్లాను టూరిజం ప్లేస్ చేస్తానన్నడు. ఊటీ చేస్తానని చెప్పి లూటీ చేసిండు. వీటిపై పోరాడేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నం.
కళ్లున్న వ్యక్తలు…విమర్శించే మూర్ఖులు ఎవరైనా మా యాత్రకు వస్తున్న జనాలను కళ్లారా చూడండి.
ఈ రోజు దేవేంద్ర ఫడ్నవీస్ ఇక్కడికొచ్చి పోయిండు. ‘‘బండి సంజయ్ తప్పకుండా కొట్లాడు. తెలంగాణలో కాషాయ జెండాను రెపరెపలాడించాల్సిందే. బీజేపీ పక్కా అధికారంలోకి వస్తదనే నమ్మకం నాకుంది’’అని దేవేంద్ర ఫడ్నవీస్ గారు ధీమా వ్యక్తం చేసిండు. గతంలో ఆయన మహారాష్ట్ర సీఎంగా పనిచేసిండు. ఒకేసారి ఏడాదిలోపు 70 వేల ఇండ్లను నిర్మించి ఒకేసారి గ్రుహ ప్రవేశం చేయించిన ఘనత ఫడ్నవీస్ దే. కానీ ఈ సీఎం కేసీఆర్ కేంద్రం నుండి ప్రధాని ఆవాస్ యోజన కింద రూ.1500 కోట్లు తెచ్చుకుని ఒక్క ఇల్లు కూడా నిర్మించకుండా నిదులు దారి మళ్లించిండు.
ఢిల్లీకి పోయి కత్తి తిప్పుతానని చెప్పి ఫాంహౌజ్ లోకి పోయి పడుకున్న చరిత్ర కేసీఆర్ ది. ఇక్కడి యువత ఉద్యోగాల్లేక ఇబ్బంది పడుతున్నరు. స్కూళ్లు లేవు. కాలేజీల్లేవు. కానీ గల్లీకొక బార్ మాత్రం పెట్టి దోచుకుండు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ వంద కోట్లు ఖర్చు పెట్టి గెలిచినా వాళ్లకు సంతోషం లేకుండా పోయిందని ఆ పార్టీ నేతలే స్వయంగా చెబుతున్నరు. హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచేది కాషాయజెండానే.
బీజేపీ ఇస్లాంకు వ్యతిరేకం కాదు. క్రైస్తవాన్ని కించపర్చలేదు. ముస్లింలు ఆలోచించాలి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ మోచేతి నీళ్లు తాగే ఓవైసీ పాతబస్తీకి మెట్రో రైలు ఎందుకు రావడం లేదు? యువకులకు పాస్ పోర్టులు ఎందుకు రావడం లేదు? కొత్త సంస్థలు ఎందుకు రావడం లేదో ఆలోచించాలి. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఖచ్చితంగా అడ్డుకుని తీరతం.
బీజేపీ మీ కోసం కష్టపడి పనిచేస్తున్నం. మీకు ఆపదవస్తే, సమస్యలతో తల్లడిల్లుతుంటే వచ్చి ఆదుకునే పార్టీ బీజేపీ. మీకోసం జైలుకు పోయినం. లాఠీ దెబ్బలు తిన్నం. కోవిడ్ సమయంలో మిమ్ముల్ని ఆదుకునే క్రమంలో 8 మంది కార్యకర్తలు చనిపోయిండ్రు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నేను నా తల్లి, భార్య, పిల్లలను ఒప్పించినం. హిందూ ధర్మం కోసం పనిచేయడానికి, పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దాకా ఇంటికి రాం. అని ఒప్పించినం. ఆ మాట కాంగ్రెస్, టీఆర్ఎస్
పార్టీలను చెప్పమనండి.
అమరుల ఆశయాల కోసం పోరాడుతున్నా
1400 మంది అమరుల త్యాగాలపై, రక్తపు మడుగులపై ఓ కుటుంబం రాజ్యమేలుతోంది. తెలంగాణ తల్లి ఫాంహౌజ్ లో బందీ అయ్యింది. తెలంగాణ తల్లి తల్లడిల్లుతోంది. నన్ను బంధ విముక్తిరాలిని చేయండి. ప్రజా స్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం రండి బీజేపీ కార్యకర్తల్లారా….జై తెలంగాణ, జై శ్రీరాం, భారత్ మాతాకీ జై అంటూ కదలండి. నన్ను విముక్తి చేయండని కోరుతోంది. అందరం కలిసి ఆ తల్లిని బంధ విముక్తిరాలిని చేద్దాం…కదలిరండి…అందుకోసమే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నం.
శ్యామాప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ స్పూర్తితో నరేంద్ర మోదీ పాలన చేస్తున్నరు. నేను మీ అందరి కోసం యాత్ర చేస్తున్న. ఏ లక్ష్యం కోసం తెలంగాణ వచ్చిందో…ఏ త్యాగాలతో తెలంగాణ వచ్చిందో….వారి ఆశయాల కోసం పోరాడేందుకే ఈ పాదయాత్ర చేస్తున్నా. మీ అందరూ సహకరించాలని కోరుతున్న. జై శ్రీరాం…
బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన నాయకులు….
కాంగ్రెస్ మైనారిటీ ప్రెసిడెంట్ కొత్తగడీ గౌస్, యువ నాయకుడు ప్రశాంత్, సిద్దలూర్ మాజీ సర్పంచ్ మల్లేష్, పిరంపల్లి గణపతి, అనంతగిరిపల్లి లక్ష్మణ్, అత్వెల్ల నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ ఎర్రవెల్లి సుభాన్ రెడ్డి, రాంరెడ్డి మదన్ పల్లి, వెంకటయ్య తదితరులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు.
పోలీసులపై మాజీ మంత్రి చంద్రశేఖర్ ఫైర్….
‘‘తెలంగాణ వస్తే నీళ్లు వస్తయన్నరు. ప్రత రైతుకు రూ.లక్ష రుణమాఫీ అన్నడు. ఎరువులు, పురుగుల మందు ఫ్రీగా ఇస్తనన్నడు. కానీ ఒక్కటీ ఇవ్వలేదు. కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం యువకులను వంచన చేసింది. ఆడవాళ్లను వంచిస్తోంది. ఇప్పటి వరకు కూడా గ్రామాలకు ఒక్క పైసా ఇచ్చిన దాఖలాల్లేవ్.’’అని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.
‘‘నేను 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్న. నరేంద్రమోదీ వంటి ప్రధానమంత్రిని నేనెన్నడూ చూడలేదు. పేదలు, మహిళల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నడు. గ్రామ పంచాయతీలకు నరేంద్రమోదీ ప్రభుత్వం కనీసం రూ.50 లక్షలు ఇచ్చిండు. రైతు వేదికలకు, ప్రక్రుతి వనాలకు, మరుగుదొడ్లకు, ఎల్ ఈడీ లైట్ల కోసం నిధులన్నీ కేంద్రానివే.’’అని పేర్కొన్నారు.
‘‘ఇక్కడున్న వారందరినీ లక్షాధికారులను చేస్తానని చెప్పి గప్పాలు కొట్టిండు. 4 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించిండు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించిండు. కాంట్రాక్ట్ ఉద్యోగులను గాలికొదిలేసిండు. ఒక్క డీఎస్సీ లేదు. నిరుద్యోగ భ్రుతి లేదు. ఉద్యోగాల్లేవు.’’అని వాపోయారు. ఈ సందర్భంగా పోలీసులపై చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. తాను పూలు వేస్తామని కోరితే పోలీసులు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. ’’ఇక్కడి పోలీసోళ్లను రేసు కుక్కల్లాగా పెంచి పోషిస్తుండు. కేసీఆర్ కు రక్షణగా ఉన్నారే తప్ప ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. ఇక్కడ వెధవ ఎస్పీ గాడు పూల చల్లుతానంటే అనుమతి ఇవ్వలేదు. బిడ్డా…మాకూ టైమొస్తది. బూట్లు నాకిపిస్తా. బీజేపీ కార్యకర్తలంతా నరేంద్ర మోదీ సైనికులు కదులుతుండ్రు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. ఆనాడు ఇలాంటి పోలీసులకు కాలం చెల్లక తప్పదు.’’అని హెచ్చరించారు.
ఈ సభకు హాజరైన వారు పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ మనోహర్ రెడ్డి, ప్రదీప్ కుమార్, ఎస్సీ, ఎస్టీ, మహిళా, బీసీ, కిసాన్, యువ మోర్చా అధ్యక్షులు కొప్పు భాషా, హుస్సేన్ నాయక్, గీతామూర్తి, ఆలె భాస్కర్, శ్రీధర్ రెడి, భాను ప్రకాశ్ తదితరులున్నారు.