అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని అధ్వాన్నపు రోడ్లపై జనసేన పార్టీ వినూత్న కార్యక్రమం నిర్వహించింది. గతుకుల, గుంతల రోడ్లపై జనసేన కార్యకర్తలు ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియా లో ట్విట్టర్ లో ప్రచారం చేయడంతో మూడు రోజుల్లోనే రెండు లక్షలకు పైగా ట్వీట్స్ చేశారు జనసేన కార్యకర్తలు దాదాపుగా పదిహేను వేలకు పైగా ఫోటోలు,ఐదు వేలకు పైగా వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇది దాదాపుగా 200 మిలియన్ సోషల్ మీడియా యూజర్లను చేరింది. ఒక రాజకీయ పార్టీగా ఇది చాలా పెద్దప్రచారం గా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ప్రజల తక్షణ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో జనసేన కార్యకర్తలు చేసిన కృషికి పలువురు నెటిజన్లు ఫిదా అయ్యారు . ప్రభుత్వం నుంచి స్పందన వచ్చినా రాకపోయినా ప్రజలకు కావల్సిన విషయాలను ప్రభుత్వానికి చేరవేయడంలో మంచి అవకాశంగా జనసేన మలుచుకున్నదని, భవిష్యత్ లో రాజకీయ ఉద్యమాలకు ఇది దోహద పడుతుందని జనసేన నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు .