న్యూ ఢిల్లీ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. ఢిల్లీ లో తెరాస కార్యాలయ భవనం శంకుస్థాపన కు వెళ్లిన సీఎం అక్కడే ప్రధాని మోడీ తో భేటి అయ్యారు. ఈ రోజు హోంమంత్రి అమిత్ షా తో 45 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
తెలంగాణ లో కొత్త జిల్లాల కు అనుగుణంగా ఐపీఎస్ క్యాడర్ తో పాటు సాంక్షన్ పోస్టుల సంఖ్య కూడా పెంచాలని హోంమంత్రి కి విజ్ఞప్తి చేసినట్టు తెలంగాణ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.