జూబ్లీహిల్స్‌లో మలబార్ గోల్డ్ భారీ షోరూమ్ ప్రారంభం..

పొలిటికల్ వాయిస్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 16,2026:ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ ‘మలబార్ గోల్డ్ & డైమండ్స్’ రిటైల్ రంగంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో ఏర్పాటు చేసిన అత్యంత ప్రతిష్టాత్మక ‘ఆర్టిస్ట్రి స్టోర్’ను బాలీవుడ్ ప్రముఖ నటి కరీనా కపూర్ ఖాన్ గురువారం ఘనంగా ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలు, అరుదైన డిజైన్ల మేళవింపుతో రూపొందించిన ఈ స్టోర్ దేశంలోనే ప్రత్యేకమైన క్యూయేటెడ్ లగ్జరీ జ్యువెలరీ డెస్టినేషన్‌గా నిలవనుంది.

అత్యాధునిక హంగులతో 16 వేల చదరపు అడుగుల్లో..
సుమారు 16,000 చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో నిర్మించిన ఈ స్టోర్, కేవలం విక్రయాలకే పరిమితం కాకుండా వినియోగదారులకు ఒక మధురమైన అనుభూతిని అందించేలా తీర్చిదిద్దారు. ప్రైవసీ, వ్యక్తిగత సంప్రదింపులు, నిపుణుల సలహాలతో కూడిన హై-టచ్ లగ్జరీ వాతావరణాన్ని ఇక్కడ కల్పించారు. ట్రాన్సాక్షన్ ఆధారిత రిటైల్ నుంచి ‘రిలేషన్ షిప్’ ఆధారిత అనుభవానికి ఈ స్టోర్ మలుపు తిప్పుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

నాణ్యత, విశ్వాసానికి నిదర్శనం: ఎం.పి. అహమ్మద్
ఈ సందర్భంగా మలబార్ గ్రూప్ ఛైర్మన్ ఎం.పి. అహమ్మద్ మాట్లాడుతూ.. “వినియోగదారుల అంచనాలకు అనుగుణంగా జ్యువెలరీ రిటైల్ రంగంలో మేము సరికొత్త మార్పులు తీసుకొస్తున్నాం. వ్యక్తిగత అనుభవం, నైపుణ్యం, విశ్వాసం కీలకంగా మారిన నేటి కాలంలో వాటిని ప్రతిబింబించేలా ఈ స్టోర్‌ను రూపొందించాం. నాణ్యత, పారదర్శకత పట్ల మాకున్న నిబద్ధతను ఇది మరింత బలోపేతం చేస్తుంది” అని అన్నారు.

వారసత్వానికి ప్రతీక ఆభరణం: కరీనా కపూర్
కరీనా కపూర్ ఖాన్ మాట్లాడుతూ.. “నేటి కాలంలో ఆభరణాలు వ్యక్తిత్వాన్ని, వారసత్వాన్ని ప్రతిబింబించే సాధనాలుగా మారాయి. ఈ స్టోర్‌లో ప్రతి అంశాన్ని వినియోగదారుల కోణంలో ఆలోచించి రూపొందించడం అద్భుతంగా ఉంది. ఇక్కడి డిజైన్లలో లగ్జరీ అనుభూతి స్పష్టంగా కనిపిస్తోంది” అని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ ఇండియా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆశర్ ఓ, రిటైల్ హెడ్ సిరాజ్ పి. కె., హైదరాబాద్ జోనల్ హెడ్ మహమ్మద్ షరీజ్ సహా వ్యాపార, మీడియా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *