న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం (రేపు) ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు దిల్లీలో బయలుదేరి 11.15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో 12.25 గంటలకు సున్నిపెంటకు వచ్చి రోడ్డు మార్గాన శ్రీశైలం చేరుకుంటారు. మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 గంటల మధ్య మల్లన్నను దర్శించుకోనున్నారు. భ్రమరాంబ అతిథిగృహంలో మధ్యాహ్న భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2.45 గంటలకు శ్రీశైలం నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు చేరుకుని అక్కడ నుంచి 3.50 గంటలకు దిల్లీకి బయలుదేరతారు.