వేములవాడ పర్యటనలో భాగంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నాగారంలో రూ. 36 లక్షల అంచనా వ్యయంతో పునఃనిర్మించనున్న శ్రీ కోదండ రామాలయానికి భూమి పూజ చేశారు. అనంతరం వేములవాడలో భక్తుల సౌకర్యార్ధం నిర్మించిన శ్రీ భీమేశ్వర స్వామి అతిధి గృహాన్ని ప్రారంభించారు. అంతకుముందు వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మంత్రి వెంట ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, తదితరులు ఉన్నారు.