కర్నూలు: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుటుంబ సమేతంగా శ్రీశైలం మల్లన్న స్వామి ని సేవించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న అమిత్ షా హెలికాప్టర్ లో శ్రీశైలం చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు అర్చకులు.