‘ఆచార్య’ షూటింగ్ తిరిగి మొదలైంది
చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మల్టీస్టారర్ ‘ఆచార్య’ షూటింగ్ తిరిగి మొదలైంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఇందులో మెగాస్టార్‌కి జంటగా కాజల్ అగర్వాల్, చరణ్‌కి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు.
సంగీత, రెజీనా సాంగ్స్‌లో మెరవబోతున్నారు. కాగా బ్యాలెన్స్ చిత్రికరణ పూర్తి చేసేందుకు నేడు షూటింగ్ మొదలు పెట్టింది చిత్ర బృందం. రెండు వారాలతో ఆచార్య షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది.
కొణిదెల ప్రొడక్షన్స్ – మ్యాట్నీ ఎంటెర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. దీని తర్వాత చిరంజీవి ‘లూసీఫర్’ తెలుగు రీమేక్‌ను పట్టాలెక్కించనున్నారు. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు.