పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం
టీ.పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహాల ఇన్చార్జ్ మాణికం ఠాగూర్, ఏఐసీసీ ఇంచార్జ్ కార్యదర్శులు బోసురాజు,

శ్రీనివాస్ కృష్ణన్, గోవా పీసీసీ అధ్యక్షుడు గిరీష్ చోడేకర్, అండమాన్ పీసీసీ అధ్యక్షుడు కులదీప్ శర్మ, ఎర్నాకులం ఎంపీ ఐబీ హెడెన్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ తారీక్ అన్వర్, ప్రచార కమిటి చైర్మన్ మధుయాష్కీ, వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, అజారుద్దీన్, జగ్గారెడ్డి, మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, టి.కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్, దాసోజు శ్రావణ్, మల్లు రవి, సీతక్క తదితరులు హాజరయ్యారు. కాగా కుమార్తె జయారెడ్డితో కలిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు రేవంత్‌ను అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గాంధీభవన్‌కు తరలివచ్చారు.