తాసిల్దార్ తక్షణం ఆ గ్రామంలో పరిశీలన చేసి రైతాంగానికి పంట పొలాలకు వెళ్లే దారిని ఏర్పాటు చేస్తానని

అమలాపురం

తూర్పు గోదావరి జిల్లా తాండవ పల్లి గ్రామంలో పంటపొలాలకు వెళ్లే దారిని ఆక్రమించిన ఆక్వా చెరువుల యజమానులపై చర్యలు తీసుకోవాలని రైతులకు పంటపొలాలకు వెళ్లే దారిని ఏర్పాటు చేయాలని ఈరోజు అమలాపురం ఆర్డీవో వసంతరాయుడు మరియు మండల తాసిల్దార్ టాగూర్ లకు వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు సామాజిక కార్యకర్త పశ్చిమ బాబ్జి పెనుమాల చిట్టిబాబు సాపే బాల రవి దొమ్మేటి రామకృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది
ఈ సందర్భంగా తాసిల్దార్ తక్షణం ఆ గ్రామంలో పరిశీలన చేసి రైతాంగానికి పంట పొలాలకు వెళ్లే దారిని ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది

మరియు
అల్లవరం మండలం అల్లవరం గ్రామంలో సాపే వారి పేట తదితర గ్రామాల్లో కోవిడ్ నేపథ్యంలో అధిక కేసులు నమోదయ్యాయని ఆ ప్రాంతంలో ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి నియంత్రించే చర్యలు చేపట్టాలని స్థానిక అమలాపురం ఆర్డిఓ వసంత నాయుడు గారికి ప్రజా సంఘాల నాయకులు పశ్చిమ బాబ్ది సాపే బాల రవి పెనుమాల చిట్టిబాబు కారెెం వెంకటేశ్వరరావు లు వినతి పత్రం అందించడం జరిగింది ఈపాటికే గ్రామంలో పంచాయతీ కార్యదర్శి మరియు వైద్య సిబ్బంది కొన్ని చర్యలు చేపట్టాలని కొవిడ్ పెరుగుదల గల కారణాలను వెలికితీయాలని నియంత్రణ చర్యలు మరింత వేగవంతం చేయాలి చేపట్టాలని వారు వినతి పత్రంలో పేర్కొనడం జరిగింది

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *