దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నట్లు వార్తలు వస్తుంటే.. ఇక ప్రతిపక్షంగా ఉన్న మేఘాలయలో.. ప్రస్తుతం ఉన్న 17 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది పార్టీకి గుడ్‌బై చెప్పి టీఎంసీలో చేరనున్నారు. ఈ విషయాన్ని టీఎంసీ వెల్లడించింది. పార్టీ మారనున్న వారిలో మాజీ సీఎం ముకుల్ సంగ్మాతో పాటుగా 12 మంది ఉన్నట్లు సమాచారం. 2023లో మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో అక్కడ టీఎంసీ పార్టీ ఎలాగైనా అధికారం చేపట్టేందుకు పక్కా ప్లాన్లు వేస్తోంది. అయితే ప్రస్తుతం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన టీంతో షిల్లాంగ్‌లో ఉండి రాజకీయచక్రం తిప్పుతున్నారు. ప్రస్తుతం అక్కడ ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్.. 12 మంది ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరితే.. ఉన్న ప్రతిపక్షా హోదాను కోల్పోనుంది. మరోవైపు 2023లో అధికారం కోసం ప్రయత్నిస్తున్న టీఎంసీకి ఆ ప్రతిపక్ష హోదా దక్కనుంది.