రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలుగు స్వాతంత్య్ర సమర యోధుల జీవిత విశేషాలపై రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో చాయా చిత్ర ప్రదర్శన

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో, కోఠిలోని యూనివర్సిటీ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన చాయా చిత్ర ప్రదర్శనను కళాశాల ప్రిన్సిపల్ ఎం. విజ్జులత బుధవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య అమృత మహోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని, దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహానీయులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా.. అనేక పోరాటాలు జరిపారని, మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎందరో స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని అన్నారు.

‘ఆజాది కా అమృత్ మహోత్సవాల’లో భాగంగా ఆ మహనీయుల త్యాగాలు, వారి వీరోచిత పోరాటాల గురించి నేటి తరానికి తెలియచేయాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన విధ్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, వారిలో స్ఫూర్తిని రగిల్చే విధంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు ఉంటుందని, విధ్యార్థులు ఈ ప్రదర్శనలో భాగమవ్వాలని పిలుపునిచ్చారు. పింగళి వెంకయ్య, కుమురం భీం, చాకలి ఐలమ్మ, స్వామి రామానంద తీర్థ, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, సురవరం ప్రతాపరెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి ఎందరో స్వాతంత్ర్య సమరయోధల జీవిత విశేషాలకు సంబంధించిన ఛాయాచిత్రాలను ఈ ప్రదర్శనలో వుంచారు.

భారత రాజ్యాంగ విలువలను దేశ ప్రజలలోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ప్రతి ఏటా నవంబర్ 26 వ తేదిన రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) జరుపుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 19 నవంబర్ 2015న నోటిఫై చేసింది. అప్పటి నుండి మనం ప్రతి ఏటా రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) జరుపుకుంటున్నాం. ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం సంధర్భంగా భారత రాజ్యాంగం, దాని విశిష్టత గురించి తెలియచేసే ఫోటోలను కూడా ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసారు. రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో ఆద్వర్యం లో తెలుగు స్వాతంత్య్ర సమర యోధులపై విధ్యార్థులకు పెయింటింగ్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ లు హరిబాబు, భరత లక్ష్మి, ఎగ్జిబిషన్ అధికారి అర్థ శ్రీనివాస్ పటేల్, కళాశాల అధ్యాపక బృందం, విధ్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *