హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర తొలిరోజు ముగిసింది. రాత్రి మెహిదీపట్నం లోని పుల్లారెడ్డి ఫార్మసీ కాలేజ్ లో బస చేశారు. ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి మందిరం నుంచి ప్రారంభం అయిన యాత్ర నాంపల్లి, అసెంబ్లీ, మాసబ్ ట్యాంక్, మీదుగా మెహిదీపట్నం చేరుకున్నది. తొలిరోజు పది కిలోమీటర్ల పాదయాత్ర చేశారు బండి సంజయ్.