హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. చార్మినార్ భాగ్యలక్ష్మి మందిరంలో ప్రత్యేక పూజల అనంతరం పాదయాత్ర మొదలుపెట్టారు. ప్రత్యేకంగా చేసిన శంఖం తో శంఖారావం చేసి పాదయాత్ర మొదలుపెట్టారు. పాదయాత్ర మొదలవ్వగానే భారీ వర్షం కురిసింది. భారీ వర్షంలో కూడా వేలాది మంది తో పాదయాత్ర కొనసాగింది. 40 రోజుల పాటు యాత్ర కొనసాగి హుజురాబాద్ లో ముగియనుంది.