హైదరాబాద్: రాజకీయ విమర్శల కోసం దేశాన్ని ఐక్యం చేసిన మహనీయుడు హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనం చేసిన ఉక్కు మనిషి ని గుజరాతీ అని ప్రాంతీయత అంటగట్టిన దౌర్భాగ్యం తెరాస పార్టీ దని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు దుయ్యబట్టారు. పాదయాత్ర విఫలం అయితే అధికార పార్టీ కి భయం ఎందుకని విమర్శించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కనీసం పార్లమెంటు లో మీ పార్టీ లేనప్పుడు తెలంగాణ బిల్లు పాస్ చేయించిన ఢిల్లీ పార్టీ బీజేపీ అన్నారు. బీజేపీ దేశభక్తికి, జాతీయ వాదానికి బానిస అని మీ లాగా ఒక కుటుంబానికి బానిస కాదని హేళన చేశారు.