చేవెళ్ల బహిరంగ సభలో బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు….
• చేవెళ్లలో ఇంత పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. మీకు శిరసు వంచి నమస్కరిస్తున్న. మీ అభిమానాన్ని జీవితాంతం మర్చిపోలేను. చేవెళ్ల కు వస్తేనే చైతన్యం గుర్తుకొస్తుంది. మీరు పటపట పళ్లు కొరికితే అవతలి వారి చెవుల నుండి రక్తం కారాలే.
• ఈ జిల్లాకు బీజేపీ ఏం చేసిందని టీఆర్ఎసోళ్లు పిచ్చికూతలు కూస్తుండ్రు. రంగారెడ్డి జిల్లాకు కేంద్రం రూ.1040 కోట్లు ఇచ్చింది. ఒక్క చేవెళ్లకే రూ.200 కోట్లు ఇచ్చినం. అన్నీ లెక్కలున్నయ్.
• పీఎంఏవై కింద 70 వేల ఇండ్లు ఇచ్చినం. స్వచ్ఛ భారత్ పేరిట టాయిలెట్ల నిర్మాణానికి డబ్బులిచ్చినం. రేషన్ బియ్యం, కంపా నిధులిచ్చినం. నీళ్లకు, రైతు వేదికలు, స్మశానవాటికల డబ్బులు కేంద్రానివే. అసలు మీరేం చేశారో చెప్పండంటూ… ముఖ్యమంత్రిని, టీఆర్ఎస్ నాయకులను గల్లపట్టి నిలదీయండి.
• కొంత మంది చేతకాని దద్దమ్మలు కేసులు మాఫీ చేసుకోవడానికి పార్టీలు మారుతుండ్రు. రేషన్ కార్డుల కోసం 6 వేల మంది దరఖాస్తు చేసుకుంటే 1200 మాత్రమే ఇచ్చిండ్రు. చేతగాని మాటలొద్దు. టీఆర్ఎసోళ్లకు చేతనైతే బస్టాండ్ ను బాగు చేయమనండి.
• ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ పేరుతో ఈ జిల్లాకు నీళ్లిస్తానని ఓ పెద్దాయన సొరంగం తవ్వి దంచుకున్నడు. కానీ నీళ్లు మాత్రం రాలే. ఇప్పుడున్నాయ రీడిజైన్ అన్నడు. కమీషన్లు దోచుకున్నడు గానీ నీళ్లు మాత్రం రాలేదు. రైతుల నోట్లో మట్టికొట్టిండ్రు.
• వస్తుంటే రైతులు కలిసిండ్రు. రూ.లక్ష రుణమాఫీ ఇస్తానంటే నమ్మి పంట వేసుకున్న. రుణమాఫీ రాలేదు. బ్యాంకోళ్లు నా పైసలను జమ చేసుకుండ్రు. చివరకు రైతు బంధు సొమ్ము కూడా జమ చేసుకుని రోడ్డున పడేసిండ్రని ఏడుస్తుండు. చందన్ పల్లిలో రైతుల గోస తీరనిది. వాళ్ల భూములను లాక్కుండ్రు. రైతులను దిక్కులేని వాళ్లను చేసిండ్రు. తలుచుకుంటే ఏడుపొస్తుంది(భావోద్వేగంతో). కమీషన్ల కోసం కక్కుర్తి పడి రైతుల పొట్ట కొట్టిన దుర్మార్గులు వీళ్లు.
• వస్తుంటే నిరుద్యోగులు వచ్చి ఏడుస్తుండ్రు. డిగ్రీ, పీజీలు, డాక్టరేట్లు చేసినా ఉద్యోగం రావట్లేదని, ఏజ్ బార్ అవుతుందని బాధపడుతుండ్రు. కనీసం నిరుద్యోగ భ్రుతి కూడా ఇవ్వలేదని వాపోయిండ్రు.
• 5 లక్షల ఉద్యోగాలిస్తనని పేకిన కేసీఆర్ ఒక్కడికైనా ఉద్యోగమిచ్చిండా. పైగా కేసీఆర్ గొప్పోడట. పక్క రాష్ట్రంవాళ్లు పొడుగుతున్నరట. అట్లాయీతే నేనే తోమాల, సుప్రభాత సేవచేసి మోసుకెళ్లి పక్కరాష్రంలో పడేసి వస్త పీడబోతది. ఉద్యోగాలివ్వకపోతే బడితే పూజ చేయిస్తా.
• ఇయ్యాల కేసీఆర్ మళ్లీ ఢిల్లీ పోయిండు. ఇక కోతలు కోస్తడు. అక్కడికి పోతడు. వంగి వంగి దండాలు పెడతాడు. బయటకు వచ్చి నన్ను అందరూ శభాష్ అన్నారని కోతలు కోస్తరు. కొన్ని మీడియా సంస్థలకు లీకులచ్చి వార్తలు రాయించుకుంటడు. కేసీఆర్ అతిపెద్ద అవీనతిపరుడు. అతనిని జైలుకు పంపే పార్టీ బీజేపీ.
• అన్ని రాజకీయ పార్టీలకు ఆఫీస్ కట్టుకోవడానికి ఢిల్లీలో మోదీగారు స్థలం ఇస్తే ఈయన పోయి ఆఫీస్ ప్రారంభించి ఊరూవాడా జెండా పండుగ చేసుకోవాలని టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిస్తుండు. ఎవరైనా అట్ల చేస్తరా? స్థలం ఇఛ్చిందెవరు? జెండా పండుగు చేసుకునేదెవరు?
• కేసీఆర్ కు ఎన్నికలొస్తే తప్ప జనం గుర్తుకు రారు. ఎన్నికలొస్తే మాత్రం పిలిచి కోడిని, గొర్రెను, బర్రెను కోస్తడు. తలకాయ, బోటీ, లివర్ అన్నీ పెడ్తడు. అయినా సరే…హుజూరాబాద్ లో తలకాయ కిందకు, కాళ్లు పైకి పెట్టినా ఈటల రాజేందర్ గెలుస్తడు తప్ప టీఆర్ఎస్ గెలిచే ప్రసక్తే లేదు.
• ఈ నియోజకవర్గంలో నడుస్తుంటే డబుల్ బెడ్రూం శిలాఫలకాలు చూసిన. ఒక్కరికి కూడా ఇండ్లు రాలేదు కానీ శిలాఫలకాలు మాత్రం కన్పిస్తున్నయ్.
• మీ కోసం 54 ఏళ్ల కంజర్ల ప్రకాశ్ ఆరోగ్యం సహకరించకపోయినా నాతోపడి నడస్తుండు. వస్తుంటే కళ్లు తిరిగిపడిపోయిండు. అయినా సరే ఉద్యమాన్ని ఆపేది లేదు….ఈ సారి టీఆర్ఎస్ సంగతి చూస్తానంటూ తిరుగుతుండు. ఆయనకు మద్దతివ్వాల్సిందిగా కోరుతున్న.
• దళిత నియోజకవర్గం ఇది. దళితుడిని సీఎం చేస్తానన్నడు. 3 ఎకరాలు ఇస్తానన్నడు. అంబేద్కర్ విగ్రహం పెడతానని పెట్టలేదు. ఆయన మాత్రం 100 కోట్లతో 100 రూముల గడీలు కట్టుకున్నడు. 300 ఎకరాల ఫాంహౌస్ కట్టుకుని పాలీహౌజ్ పేరుతో సబ్సీడీలు తీసుకుని ఎకరానికి కోటి సంపాదిస్తుండు..
• ఇక్కడ రైతులు కూడా పాలీహౌజ్ కట్టుకోవాలని అప్పు తెచ్చి కట్టుకునే ప్రయత్నం చేస్తే ఏకంగా కేసీఆర్ సబ్సిడీ ఎత్తేసిండు. రైతుల నోట్లో మట్టి కొట్టిండు. అలాంటి వ్యక్తిని తరిమితరిమి కొట్టాల్సిన సమయం వచ్చింది.
• ఈ దేశంలో అవినీతిలేని పాలన అందిస్తున్న ప్రభుత్వం నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం. పేదలకు రేషన్, ఉచిత వ్యాక్సిన్, నిధులు ఇస్తున్న ప్రభుత్వం బీజేపిదే. ప్రజలకు రోగమొచ్చి ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటుంటే ఫాంహౌజ్ లో పడుకున్న వ్యక్తి కేసీఆర్. కరోనాను ఎదురించి బాధితులకు సాయం చేసిన చరిత్ర బీజేపీ కార్యకర్తలది.
• ఇవన్నీ మాట్లాడితే మతతత్వ పార్టీ అంటుండ్రు. బరాబర్ బీజేపీ మతతత్వ పార్టీయే. 15 నిమిషాల టైమిస్తే హిందువులను నరికి చంపుతానంటే మాట్లాడకుండా నపుంసక రాజకీయాలు చేస్తున్నరు. అట్లాంటి రాజకీయాలను బీజేపీ సహించదు. …హిందూ మతాన్ని కించపరిస్తానంటే నాతో కానే కాదు. బరాబర్ అడ్డుకుంట. మోదీని పాతబస్తీకి ఎట్లొస్తవంటే….నేను వెళ్లి సభ పెట్టి చూపించిన. మళ్లీ ఎంఐఎం గుండాలకు సవాల్ చేస్తున్నా…నీ దారుస్సలాంకు వస్తం. హిందువులను అవమానపరిస్తే బరాబర్ అడ్డుకుని తీరతం.
• మేం ఇస్లాం, క్రైస్తవాన్ని కించపర్చలేదు. రంజాన్, క్రిస్ మస్ వస్తే ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెబుతుం. కానీ దసరా, దీపావళి, ఉగాది, బోనాలు, వినాయకచవితి వస్తే ఏనాడైనా కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం వాళ్లు హిందూ బంధువులకు ఎందుకు శుభాకాంక్షలు చెప్పరు? చెప్పించాలా లేదా? వొళ్లు వంచాలా లేదా? వంచి తీరుతాం.
• బీహార్ లో 12 శాతం ఓట్లుంటే ఏ హామీ ఇవ్వకుండానే ఎంఐఎం పార్టీ 5 సీట్లు గెలిచింది. మతం పేరుతో 5 సీట్లు గెలిస్తే….80 శాతం ఉన్న హిందువులు ఓటు బ్యాంకుగా మారితే బీజేపీ ఎట్ల గెలవదో చూద్దాం. హిందూ ధర్మం కోసం పనిచేసే పార్టీ బీజేపీ. కాషాయ జెండా తెలంగాణలో రెపరెపలాడాలి.
• మీలో చైతన్యం ఉంది. తెలంగాణ కోసం ఈ జిల్లాకు చెందిన యాదరెడ్డిసహా ముగ్గురు బలిదానం చేసుకుండ్రు. రాష్ట్రం మొత్తం 1400 మంది చనిపోతే ఈనాడు ఒక్క కుటుంబమే రాజ్యమే ఏలుతోంది.
• వాళ్ల కుటుంబాలు ప్రశ్నిస్తున్నయ్. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేస్తే కేసీఆర్ చేతిలో తెలంగాణ తల్లి బందీ అయ్యిందని వారి ఆత్మలు రోదిస్తున్నయ్. భారత్ మాతాకీ జై, వందే మాతరం, జై తెలంగాణ అంటూ గడీలు బద్దలు కొట్టి బంధ విముక్తిరాలిని చేయండంటూ తెలంగాణ తల్లి ఘోషిస్తోంది. ఏ లక్ష్యం కోసం తెలంగాణ ఉద్యమం చేసినమో మళ్లీ కాషాయ జెండా పట్టుకుని తెలంగాణ ఉద్యమం చేస్తాం, బీజేపీని అధికారంలోకి తీసుకొస్తం.
• తెలంగాణలో పేదలు అరిగోస పడుతున్నరు కాబట్టే ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినం. మీకు అండగా నేనుంటా. ఏయ్ అని ఎవరైనా భయపెడితే ఒరేయ్ అని తిరగబడండి. బీజేపీ అండగా ఉంది.
• దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపెట్టడానికి మోదీ క్రుషి చేస్తుండు. బీజేపీకి అధికారమిస్తే తెలంగాణను శక్తివంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీనిస్తున్న
• ఈ సభలో బీజేపీ రాష్ట్ర నాయకులు సుధాకర్ రెడ్డి,ఎస్.కుమార్ డాక్టర్ మనోహర్ రెడ్డి, రవీంద్ర నాయక్, శోభ, ఉమ, రాములు, జిల్లా నాయకులు కంజర్ల ప్రకాశ్, అశోక్, గీత, భాను, సురేష్ తదితరులు హాజరయ్యారు.