మాకో దేశం కావాలంటున్నటీఆర్‌ఎస్‌..!

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రజలకు తప్పుడు సంకేతాలిస్తుందని టీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టాలంటూ టీఆర్‌ఎస్ అధిష్టానం పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నాడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, రైతులు పలుచోట్ల ధర్నాటు చేపట్టారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ పలు ప్రసంగాలు చేశారు.

అయితే జగిత్యాల జిల్లా కథలాపూర్‌లో జరిగిన ధర్నాలో టీఆర్ఎస్ జడ్పీటీసీ నాగం భూమయ్య ప్రసంగిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ రైతులను ఆదుకోలేని పరిస్థితి ఉంటే.. తెలంగాణను ప్రత్యేక దేశంగా ప్రకటించాలంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక దేశంలో తెలంగాణ ప్రజలను కేసీఆర్‌ అన్ని విధాలుగా ఆదుకుంటారని నాగం భూమయ్య అన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కాగా, నాగం భూమయ్య చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, కార్యకర్తలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌లో అరుణాచల్‌ ప్రదేశ్‌లో తొకముడిచిందంటూ ఆర్మీపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ.. చైనాను పొగిడిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. సర్జికల్‌ స్ట్రైక్స్‌ విషయంలో కూడా సీఎం కేసీఆర్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే అరుణాచల్‌ ప్రదేశ్‌ వ్యాఖ్యలపై సరైన సమాచారం లేకుండా కేసీఆర్‌ మాట్లాడటంతో.. ఇప్పుడు ఆయన పార్టీకి చెందిన కింది స్థాయి నేతలు కూడా దేశం పట్ల గౌరవం లేకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *