హైదరాబాద్ : హుజూరాబాద్ లో మాదిగ ఓట్లు చాలా ఉన్నాయని , అక్కడ మాదిగ అభ్యర్ధిని నిలబెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బాగా దళిత జాతిలో మరింతగా పేరు సంపాదించవచ్చని నాయకులు ఇంచార్జ్ మాణికం ఠాగూర్ క విజ్ఙప్తి చేశారు. పీసీసీ నాయకులు బక్క జడ్సన్, సతీశ్ మాదిగ, మల్లయ్య, సత్యనారాయణ , నర్సింగ్, రమేశ్ లు తదితరులు కలిసిన వారిలో ఉన్నారు. పార్టీలో కూడా మాదిగలకు సముచిత స్థానం ఇస్తే గుర్తింపు వస్తుందని, ప్రజల్లోకి వెళ్లడానికి మరింత అవకాశం ఉంటుందని విజ్ఙప్తి చేశారు.