శ్రావణ మాసం 2021 పండుగలు
ఈ మాసంలో సోమవారం వ్రతం నుండి వరలక్ష్మీ వ్రతం, తులసీ దాస్ జయంతి, వినాయక చతుర్థి, నాగ పంచమి, భాను సప్తమితో పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి వరకు అనేక పండుగలు వస్తాయి.
శ్రావణ సోమవారాలు
ఈ మాసంలో సోమవారాలన్నింటినీ హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు.
ఈ నెలలో వచ్చే సోమవారం అంటే శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు.
శ్రావణ మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతం నిర్వహిస్తారు.
నాగ పంచమి.
(ఆగస్ట్ 13)
శ్రావణ మాసంలో నాగ పంచమికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పవిత్రమైన రోజున చాలా మంది హిందువులు పుట్టలకు వెళ్లి నాగుపాములకు పాలు పోస్తారు. నాగదేవత అనుగ్రహం ఉండాలని కోరుకుంటారు. ఇదే రోజు విష్ణువు యొక్క పదో అవతారమైన
కల్కి జయంతిని జరుపుకుంటారు.
భాను సప్తమి.
(ఆగస్టు 15వ తేదీ) భానుసప్తమి పండుగను జరుపుకుంటారు.
సూర్య భగవానుడు తన రథం మరియు ఏడు గుర్రాలపై తొలిసారిగా భూమిపైకి దిగినట్లు ఈరోజు సూచిస్తుంది. ఈరోజునే భూమిపై జీవితం ప్రారంభమైందని పెద్దలు చెబుతారు. అందువల్ల ప్రజలు ఈరోజును సూర్యుడికి అంకితం చేశారు.
వరలక్ష్మీ వ్రతం.
(ఆగస్టు 20వ తేదీ)
శ్రావణ మాసంలో దక్షిణ భారతదేశంలో పాటించే అత్యంత ముఖ్యమైన పండుగల్లో వరలక్ష్మీ వ్రతం ఒకటి. ఈరోజు అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తే తమ కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.
రక్షాబంధన్.
(ఆగస్టు 22వ తేదీ)
రాఖీ పౌర్ణమి(రక్షా బంధన్) పండుగను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.
ఈ పండుగ రోజున సోదరుల చేతికి సోదరీమణులు రాఖీ కట్టి వారి శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. ఈ పండుగ సోదర, సోదరీమణుల మనోహరమైన బంధాన్ని సూచిస్తుంది.
బలరామ్ జయంతి.
(ఆగస్టు 28వ తేదీ) బలరామ్ జయంతిని జరుపుకుంటారు. వ్యవసాయం మరియు పంటల దేవునిగా బలరాముడిని సూచిస్తుంది.
కృష్ణాష్టమి.
(ఆగస్టు 30వ తేదీ)
విష్ణువు అవతారాలలో ఒకటైన శ్రీకృష్ణ జన్మదినము ఈ రోజున కృష్ణుడి అనుగ్రహం కోసం చాలా మంది భక్తులు కఠినమైన ఉపవాస దీక్ష మరియు భక్తి కీర్తనలు ఆలపిస్తారు. ఈరోజున చిన్నారులకు
కృష్ణుని అలంకారం చేసి పూజిస్తారు.
వినాయక చవితి
(సెప్టెంబర్ 10వ తేదీ) భారతీయుల అతిముఖ్య పండుగలలో ఒక పండగ. పార్వతీపరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసము శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రమున రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి