న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం చిన్న రైతులకు కిసాన్ సమ్మన్ నిధి ( PM కిసాన్ సమ్మాన్ నిధి ) కింద రెండు వేల రూపాయలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ 9వ విడత నిధులను ప్రధాని మోదీ రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా సుమారు రూ.19,500 కోట్ల మొత్తాన్ని రైతుల అకౌంట్లోకి క్రెడిట్ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ప్రధాని ఈ నగదును విడుదల చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12.30 తర్వాత డబ్బు రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా క్రెడిట్ అవుతోంది. సుమారు 9.75 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి నిధి వెళ్తుంది. ఆగస్టు-నవంబర్ పీరియడ్‌కు సంబంధించిన అమౌంట్‌ను రిలీజ్ చేశారు.