న్యూఢిల్లీ : బద్వేల్ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పనతల సురేశ్ ని జాతీయ పార్టీ ప్రకటించింది.ఈ నెల 30 న జరిగే ఉప ఎన్నికలకు వివిధ రాష్ట్రాల్లో జరిగే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బద్వేల్ స్థానంలో పోటీకి జనసేన ముందుకు వస్తే మద్దతు ఇవ్వాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెండు పార్టీల నాయకుల మధ్య చర్చ కూడా జరిగింది. కానీ అన్యుహ్యంగా జనసేన బీజేపీ ని సంప్రదించకుండానే ఏకపక్షంగా జనసేన పోటీలో ఉండటం లేదు , చనిపోయిన అభ్యర్థి కుటుంబ సభ్యురాలు పోటీలో ఉన్నందున నిర్ణయం తీసుకున్నట్టు జనసేన ప్రకటన చేసింది. బీజేపీ మాత్రం తన విధానాలకు అనుగుణంగా పోటీ కి సై అన్నది. యువమోర్చా నాయకుడు పనతల సురేశ్ ను పార్టీ అభ్యర్థిగా నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఓడిపోయినా కానీ భవిష్యత్ లో పార్టీ కి ఒక నాయకుడు ఎదగడానికి ఉపయోగం పార్టీ భావిస్తోంది.