కమలాపూర్ : హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసి సీఎం కేసీఆర్ అనేక కుట్రలను పన్నుతున్నారని బీజేపీ అభ్యర్ధి ఈటెల రాజేందర్ మండిపడ్డారు. ఆంబేద్కర్ వర్దంతి , జయంతి లకు ఏనాడు పూలదండ కూడా వేయని కేసీఆర్ ,125 అడుగుల విగ్రహం పెడతామని చెప్పి అతీ గతి లేని సీఎం ఇప్పుడు వోట్ల కోసం దళితబంధు పెడుతున్నాడని దుయ్యబట్టారు.సీఎం కార్యాలమంలో దళిత అధికారి లేడని నేనే రాజీనామా చేసిన తర్వాత చెప్పడంతో విధి లేక ఒక ఐఏఎస్ అధికారిని తీసుకున్నారన్నారు. దళిత బంధు పథకం లో కలెక్టర్, బ్యాంకు అధికారుల పెత్తనంతో కనీసం దళితుల చేతికి కూడా రాకుండా చేస్తున్నారన్నారు.
ప్రజల మద్దతు రాదని తెలిసి, 70 శాతం ప్రజలు ఈటెల రాజేందర్ వైపు ఉన్నారని ఇంటెలిజెన్స్ నివేధిక ఇస్తే చించి పడేసిన సీఎం ను చూడా అధికారులు కూడా టీఆర్ఎస్ గెలుస్తుందని తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారన్నారు. ఇక మండలాల వారిగా అధికారులను పెట్టి ఆ మండలంలో బాగాలేదని ఈ మండలంలో ,ఈ మండలంలో బాగాలేదని ఆ మండలంలో ప్రచారం చేసి తప్పుదోవ పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు .