పొలిటికల్ వాయిస్ : ఉగ్రవాదుల హిట్ లిస్టులోకి తెలంగాణ బీజేపీ నుంచి మరో ఇద్దరు నాయకుల పేర్లు చేరినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి. పార్టీ కార్యాలయం మీద కూడా ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్టు వారు అనుమానిస్తున్నారు.
బీజేపీ నాయకులకు మొదటి నుంచి కూడా అటు టెర్రరిస్టులు, ఇటు నక్సలైట్ల నుంచి కూడా ప్రాణహని ఉంటుంది. అనేకమంది నాయకులు, కార్యకర్తలను కూడా గతంలో హతమార్చిన ఘటనలు ఉన్నాయి. బీజేపీ లో కీలకంగా ఉన్న నాయకులకు ఎప్పుడు కూడా ప్రాణహాని ఉంటుంది. ఈ లిస్ట్ లో ఉన్న గత నాయకులతో పాటు కొత్తగా దుబ్బాక నుంచి గెలిచిన ఎమ్మెల్యు రఘునందన్ రావు కూడా ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దుబ్బాక గతంలో అనేక నక్సలైట్ గ్రూపులకు అడ్డాగా ఉండేది . పేరు మోసిన నక్సైలైట్లు దుబ్బాక ఏరియాలో తలదాచుకోవడానికి వస్తుంటారు. దానికి తోడు ఇటీవలి ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత అటు నక్సైలైట్లు, ఇటు టెర్రరిస్టు గ్రూపులు కూడా తమ ఉనికి చాటడానికి బీజేపీ వాయిస్ బలంగా వినిపిస్తోన్న రఘునందన్ రావును టార్గెట్ చేసినట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో జాగ్రత్తగా ఉండాలిన సూచన చేసినట్టు కూడా తెలుస్తోంది.
పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అద్యక్షుడు, ప్రస్తుత ఓబీసీ మోర్చా జాతీయ అద్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ను కూడా టార్గెట్ లో ఉన్నారని , ప్రయాణాలు చేసినప్పుడు తగు జాగ్రత్తగా ఉండాలని నిఘావర్గాలు ఆయనకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.
పార్టీ రాష్ట్ర కార్యాలయంలోకి వచ్చి వెళ్లేవారి మీద తగినంత జాగురూకతతో ఉండాలని, పార్టీ కార్యాలయంలో మరిన్ని సీసీ కెమెరాల సంఖ్చ పెంచాలని సూచించినట్టు తెలుస్తోంది.