పొలిటికల్ వాయిస్ : కాదేదీ కవితకు అనర్హం అన్నట్టు కాదేది ప్రచారానికి అనర్హం అన్నట్టుగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సాగుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా , వర్చువల్ ప్రచారంతో హైటెక్ హంగుల ద్వారా ప్రచారం సాగుతోంది.దీనికి తోడు ప్రజల్లోకి వెళ్లడానికి అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని కూడా అన్ని పార్టీలు అందిపుచ్చకుంటున్నాయి .
ఇక పార్టీ ప్రచారాన్ని ఎప్పటికప్పుడు వినూత్నంగా చీరలపై మోడీ, యోగీ ఆదిత్య నాధ్ ఫోటో లతో కొత్తగా తయారు చేయించడంతో ఉత్తర ప్రదేశ్లో పెద్ద చర్చగా మారింది . ఈ కొత్త రకం డిజైన్ చీరలతో బీజేపీ కార్యకర్తలు ప్రచారం లోకి వెళ్తుండటంతో ప్రత్యేకంగా యోగీ, మోడీ ఫోటోలు అక్కర లేకున్నా మహిళా ఓటర్లను ఆకర్షించడంతో పాటు ప్రజల్లో చర్చకు ఉపయోగపడుతున్నాయి.