హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తోన్న ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజు 11 కిలోమీటర్ల పాటు సాగింది. రాత్రి బస బాపు ఘాట్ లో చేశారు. మెహిది పట్నం నుంచి వేలాది మంది కార్యకర్తలు వెంట రాగ యాత్ర సాగింది. గోల్కొండ కాదది గొల్ల కొండ అని అక్కడ కాషాయ జెండా ఎగరవేయడం ఖాయం అన్నారు. బీజేపీ విజయోత్సవ సభ ను భాగ్యలక్ష్మి మందిరం వద్దే చేస్తామని ప్రకటించారు.