దేశంలోకి అక్రమంగా చొరబడ్డ బంగ్లాదేశీయులు ఆగడాలకు హద్దులేకుండా పోతోంది. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలైన వెస్ట్ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో వీరు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వెస్ట్‌బెంగాల్‌లో అయితే లక్షల సంఖ్యలో ఉండటంతో.. మన దేశ ప్రజలపైనే వారు పెత్తనం చలాయిస్తున్నట్లు అనధికారిక సమాచారం. తాజాగా వెస్ట్ బెంగాల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ఓట్లు కూడా వేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని నార్త్ 24 పరగణా జిల్లాలోని ఖర్గా అసెంబ్లీ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఫోటోలో ఉన్న ఎరుపు రంగు టీ షర్ట్ ధరించిన వ్యక్తి బంగ్లాదేశీయుడిగా గుర్తించిన స్థానిక బీజేపీ నాయకులు పట్టుకుని ప్రశ్నించారు. పోలింగ్ బూత్‌కు ఎందుకు వచ్చావని ప్రశ్నించడంతో.. తాను తప్పు చేశానంటూ సమాధానం ఇచ్చాడు. బీజేపీ అభ్యర్ధి జాయ్ సాహా.. ఖర్గాలో ఈ నకిలీ ఓటరైన బంగ్లాదేశీ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు హిందుస్థాన్ టైమ్స్ పేర్కొన్నట్లు ఓ జాతీయ వెబ్‌సైట్‌లో ప్రత్యేక కథనం ప్రచురించింది. సదరు వ్యక్తి టీఎంసీకి ఓటు వేయడానికే పోలింగ్ స్టేషన్ వద్దకు వచ్చినట్లు తెలిసింది. ఈ ఘటనపై బీజేపీ భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)కి ఫిర్యాదు చేసింది.
కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు చెందిన ఓ వ్యక్తి.. టీఎంసీకి ఓటు వేయబోయి పట్టుబడ్డాడు. రాష్ట్ర ప్రజలు టీఎంసీకి ఓటువేయరన్న విషయం తెలుసుకుని మమతా బెనర్జీ ఇలా రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని.. వచ్చే ఎన్నికల్లో పాక్ నుంచి కూడా ఓటర్లను దిగుమతి చేసుకున్నా ఆశ్చర్యపోఅక్కర్లేదంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.