కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభను కవర్ చేసేందుకు వీడియో, ఫోటో జర్నలిస్టులను అనుమతించకపోవడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు.
గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైన సిరిసిల్ల సభకు కూడా జర్నలిస్టులను అనుమతించలేదని దుయ్యబట్టారు.
‘‘దళిత బంధు పథకం విషయంలో కేసీఆర్ నిజంగా చిత్తశుద్దితో, పారదర్శకంగా అమలు చేయాలని ఉంటే హుజూరాబాద్ బహిరంగ సభకు వీడియో, ఫోటో జర్నలిస్టులను అనుమతించాలి కదా….కానీ అందుకు భిన్నంగా ఆయా జర్నలిస్టులను అనుమతించలేదంటే ఏమనుకోవాలి? కేసీఆర్ బండారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే మీడియా గొంతు నొక్కేందుకు టీఆరెస్ ప్రభుత్వం సిద్ధమైంది. అధికార బలంతో తాత్కాలికంగా మీడియా గొంతును నొక్కగలరేమో కానీ…ప్రజల గొంతును నొక్కలేరు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ కు కర్రు కాల్చి వాతపెట్టడం ఖాయం’’ అని పేర్కొన్నారు.