ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా  ఆర్.వో.బి. ఆధ్వర్యంలో ఎం‌జి‌బి‌ఎస్ లో మూడు రోజుల పాటు ‘ప్రముఖ తెలుగు స్వాతంత్య్ర సమర యోధుల’ చాయా చిత్ర ప్రదర్శన

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ‘స్వాతంత్య్ర అమృత మహోత్సవం’ పేరిట కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా కేంద్ర స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖకు చెందిన రీజినల్ ఔట్ రీచ్ బ్యూరో ఎం‌జి‌బి‌ఎస్ లో ‘ప్రముఖ తెలుగు స్వాతంత్య్ర సమరయోధుల’ పై చాయాచిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి జాయింట్ పోలీస్ కమిషనర్ శ్రీ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు మన వారసత్వంలో భాగమని, వీటిని తరువాతి తరానికి అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇలాంటి ప్రదర్శనలు మనలో దేశ భక్తి, జాతీయ భావం పెంపొందేలా సహాయపడతాయని ఆయన అన్నారు. ఈ విషయంలో ఆర్.వో.బి. అధికారుల కృషిని ఆయన కొనియాడారు.

యువత స్వాతంత్య్ర సమరయోధుల సందేశాల్ని సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేయాలని రమేష్ రెడ్డి కోరారు.తెలుగు స్వాతంత్య్ర సమరయోధులపై ఆర్.వో.బి తయారు చేసిన పలు అంశాలను హైదరాబాద్ పోలీస్ శాఖ సోషల్ మీడియా ద్వారా ప్రచారం కల్పిస్తామన్నారు, ఉర్దూ భాషలో కూడా ఇలాంటి చిత్ర ప్రదర్శను తీసుకురావాలని ఆయన ఆర్.వో.బి. అధికారులని కోరారు.

శృతి పాటిల్, డైరెక్టర్ (ఆర్.ఓ.బి, పి.ఐ.బి) మాట్లాడుతూ ఆజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా సందర్శనీయ వారోత్సవాలను( ‘ఐకానిక్ వీక్’)  పురస్కరించుకొని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ఇందులో భాగంగా స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రాంతీయ స్వాతంత్య్ర సమరయోధుల ప్రాముఖ్యతను తెలియచేయడానికి ఈ చిత్ర ప్రదర్శనను ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా కేంద్ర సమాచార శాఖకు చెందిన హైదరాబాద్ పబ్లికేషన్ డివిజన్, పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేసింది. స్వాతంత్య్ర పోరాట చరిత్రకు సంబంధించిన పలు  ప్రతిష్టాత్మక ప్రచురణలు ఈ  ప్రదర్శనలో ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆజాదీకా అమృత్ మహోత్సవంపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక బృందాల ప్రదర్శన ఆకట్టుకుంది.

డిప్యూటీ డైరెక్టర్ మానస్ కృష్ణకాంత్, అసిస్టెంట్ డైరెక్టర్లు హరిబాబు, శ్రీమతి భారత లక్ష్మి మరియు శ్రీమతి వందన,  ఎన్.వై.కె కో ఆర్డినేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *