బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు ఢిల్లీ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంద కృష్ణ మాదిగ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంద కృష్ణ బాత్ రూమ్ లో కాలు జారి కింద పడటం తో కాలుకు శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే.