విశాఖ పట్నం : విశాఖ ఏజెన్సీలో ప్రబలుతోన్న విషజ్వరాలకు బీజేపీ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ తుది శ్వాస విడిచారు . అరకు పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా రెండు సార్లు పోటీ చేసిన గాంధీ రాష్ట్ర పార్టీలో కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నారు . ఐఐటీ మద్రాస్ లో చదివిన గాంధీ మంచి జీతం వచ్చే కార్పోరేట్ ఉద్యోగాలను సైతం వదులుకుని నమ్మిన సిద్దాంతాల కోసం , ఏజెన్సీ గిరిజనుల అభివృద్ది శ్రేయస్సుకోసం బీజేపీలో చేరి పాటు పడుతున్నారు. డెంగ్యూ జ్వరం తో బాధపడుతోన్న గాంధీ అర్ధంతరంగా తనువు చాలించారు . బీజేపీ అద్యక్షుడు సోము వీర్రాజు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , బీజేపీ నాయకులు ఆయన కుంటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు . బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
ఏజెన్సీ ప్రాంతంలో ప్రబలుతోన్న విషజ్వరాలకు ఇది నిదర్శనం అని , రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మన్యం ఏరియాల్లో వెంటనే ప్రత్యేక హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి గిరిజనులకు వైద్య సాయం అందించాలని బీజేపీ డిమాండ్ చేసింది.