అక్రమ ఆక్వా చెరువు పై చర్యలు తీసుకోండి

అక్రమ ఆక్వా చెరువు పై చర్యలు తీసుకోండి

అమలాపురం జూలై 9
అమలాపురం రూరల్ మండలం తాండ పల్లి పల్లి చింతలపూడి పరిధిలో అక్రమంగా సాగు చేస్తున్న అక్రమ ఆక్వా చెరువులపై చర్యలు తీసుకోవాలని అలాగే సుమారు 36 ఎకరాల పంట పొలాలకు వెళ్లే దారిని కొందరు భూస్వాములు ఆక్రమించారని ఆ దారిని రైతాంగానికి పంట పొలాలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ

ఈ సోమవారం అమలాపురం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వసంతరాయుడు మరియు స్థానిక తాసిల్దార్ ఠాగూర్ లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు తాసిల్దార్ ఠాగూర్ గారు తాండవ పల్లి గ్రామంలో అక్రమంగా సాగు జరుగుతున్న ఆక్వా చెరువులను మరియు పంట పొలాలకు వెళ్లే దారిని ప్రత్యక్షంగా వచ్చి పరిశీలించడం జరిగింది దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి న న్యాయం చేస్తామని అక్రమంగా సాగు చేస్తున్న చెరువుల పై చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ ఠాగూర్ గారు తెలియజేయడం జరిగింది


ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు సామాజిక కార్యకర్త పశ్చిమ బాబ్జి స్థానిక రైతులు గ్రామస్తులు మాట్లాడుతూ 2014 నుండి ఈ అక్రమా ఆక్వా చెరువులపై చర్యలు తీసుకొని వీటి వల్ల నష్టపోతున్న సాగు రైతులకు నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేయాలని అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహించామని కానీ ప్రభుత్వం నుండి సరైన రీతిలో చర్యలు తీసుకోవడం లేదని ఇప్పటికైనా అక్రమ ఆక్వా చెరువులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు

ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఇదే అక్రమా ఆక్వా చెరువులపై హైకోర్టు వెళ్లడం జరిగిందని అప్పటి జిల్లా కలెక్టర్ ఈ యాభై ఆరు ఎకరాల చెరువులను ధ్వంసం చేయించారని నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం ద్వారా నష్ట పరిహరం కూడా ఇప్పించారని బీడు వారిన భూములను సాగులోకి తీసుకురావడానికి సుమారు మూడు లక్షల ప్రభుత్వ ధనాన్ని వెచ్చించారని కానీ నెలలు తిరక్కుండానే మరల అక్రమంగా ఆక్వా చెరుకు సాగు చేస్తున్నారని వీటికి ఏవిధమైన పర్మిషన్లు లేవని వీటిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు రైతులు దంగేటి రామకృష్ణ జయరాం సుబ్బారావు గ్రామస్తులు మహిలలు పాల్గొన్నారు

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *