హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా పడింది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,మాజీ గవర్నర్ కళ్యాణ్ సింగ్ మరణం తో ఈ నెల 28 వరకు పార్టీ సంతాప దినాలు పాటిస్తోంది. దీంతో జాతీయ నాయకులు ఆ కార్యక్రమాల లో ఉండి పాదయాత్ర ప్రారంభానికి వచ్చే అవకాశం కనపడటం లేదు.
రామజన్మ భూమి ఉద్యమ సమయంలో ఉత్తరప్రదేశ్ సీఎం గా ఎనలేని సేవలు చేసిన వ్యక్తి బండి సంజయ్ అన్నారు. పార్టీ కార్యాలయంలో కళ్యాణ్ సింగ్ చిత్ర పటానికి బండి సంజయ్ నివాళులు అర్పించారు.