హైదరాబాద్ : హుజూరాబాద్ లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా చేసింది మొదలు ఆ అసెంబ్లీకి వరాల జల్లు కరుస్తూనే ఉంది. హుజూరాబాద్ నాయకులకు ప్రభుత్వ, పార్టీ ఇతరత్రా పనులన్నీ చకచకా సాగిపోతున్నాయి . తాజాగా బీసీ కమిషన్ చైర్మన్ గా హుజూరాబాద్ నాయకుడు వకుళాభరణ కృష్ణమోహన్ రావును అపాయింట్ చేశారు సీఎం కేసీఆర్. సభ్యులుగా శుభప్రద్ పటేల్,ఉపేంద్ర,కిశోర్ గౌడ్ లకు అవకాశం ఇచ్చారు .
ఇప్పటికే పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్, పదవులు కూడా హుజూరాబాద్ కు వరించాయి. ఇక స్థానికంగా నాయకుల అడిగిన పని కాదనకుండా నిధులు వరద కురుస్తోన్నది.