హైదరాబాద్ : పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాలు రోడ్డు మీదకు రావాలంటే వాహనదారుకు చాలా భయం. పోలీసులు చెకింగ్ చేస్తున్నారంటే చాలు తప్పించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. తర్వాత చెల్లిస్తామన్నా లేదంటూ కొన్ని సార్లు వాహనం సీజ్ చేస్తారు. అయితే పోలీసులు చలాన్లు వేయడం వరకే కానీ వాహనం సీజ్ చేసే అధికారం లేదని హైకోర్టు చెప్పింది. దీంతో వాహన దారులకు కాస్త ఊరట లభించే అంశం.
నిఖిలేష్ అనే న్యాయవాది బైక్ పై వెళ్తుండగా పోలీసులు ఆపారు. బైక్ మీద ర1635 రూపాయల చలాన పెండింగ్ ఉందని ఎస్సై చెప్పారు. చలాన తర్వాత కడతా అని చెప్పినా కూడా వాహనం సీజ్ చేశారు. ఒక్క చలాన కు ఎలా సీజ్ చేస్తారంటూ న్యాయవాది నిఖిలేష్ అడిగినా నిబంధనల ప్రకారం వేశామని, అనుమతి లేని ఫుట్ పాత్ మీద ఎక్కారని, నిబంధనల ఉల్లంఘన, ప్రమాదకర డ్రైవింగ్ పేరుతో మూడు రకాల ఉల్లంఘనలు ఉన్నాయని చెప్పారు. ఒక్క తప్పుకు 135 రూపాయల చలాన వేయాల్సింది పోయి మూడు ఎలా వేస్తారంటూ న్యాయవాది హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు .దీంతో విచారణ చేసిన కోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు కేవలం చలాన్లు వేయడం వరకే కానీ వాహనాలు సీచ్ చేసే అధికారం లేదని స్పష్టం చేసింది