కేరళలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం హయాంలో బీజేపీ కార్యకర్తల హత్యలు నిత్యకృత్యంగా మారాయని కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్ ఆరోపించారు. గడిచిన కొద్ది సంవత్సరాల్లో కేరళలో సుమారుగా 200 మందికి పైగా బీజేపీ కారయకర్తలు హత్యగావింపబడ్డారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అన్నారు. సోమవారం నాడు కేరళలోని అలపుజాలో నిర్వహించిన ఓబీసీ మోర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేరళలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అసలు శాంతిభద్రతల నిర్వహణ అనేదే లేదని.. బీజేపీ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఇక్కడ రక్షణే లేదన్నారు. కుట్రపూరితంగా ఇన్ని హత్యలు జరుగుతున్నప్పటికీ.. ఇక్కడి పినరయ్ ప్రభుత్వం కనీస దర్యాప్తుకు కూడా వెళ్లలేదని.. పినరయి ప్రభుత్వం హత్యారాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. పక్షపాత రాజకీయాలకు ఎల్‌డీఎఫ్ సర్కార్ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని.. బీజేపీ నేతలపై, కార్యకర్తలపై జరుగుతున్న హత్యలపై విచారణ జరిపించి.. నేరస్తులను గుర్తించి శిక్షించాలని కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్ డిమాండ్ చేశారు.