గుజరాత్‌లో ఓ మత్స్సకారుల బోటు బోల్తాపడటం కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని గిర్ సోమనాథ్ సమీపంలో సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తాపడింది. ఈ ఘటనలో 10మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. అయితే గిర్ సోమనాథ్ జిల్లా సమీపంలో భారీవర్షాలు, ఈదురు గాలుల వల్ల ఏర్పడిన కారణంగానే బోటు బోల్తా పడిందని అధికారులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయ సిబ్బంది, గజ ఈతగాళ్లు ఘటనాస్థలి సమీపంలోకి ఇతర బోట్ల ద్వారా వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్నారు. గల్లంతైన మత్స్యకారుల కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. కాగా, భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ఇలా వేటకు వెళ్లడం కారణంగానే ప్రమాదం చోటుచేసుకుందని.. హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ పట్టించుకోకుండా వెళ్లడంతో ప్రమదాలు జరుగుతున్నాయని అధికారులు వాపోతున్నారు.