ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక రాజకీయ అవకాశవాది అని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు మండిపడ్డారు . కేసీఆర్ జనాలు పన్ను కట్టిన సొమ్ముతో ఓటర్లకు లంచాలివ్వడం అనే దూరలవాటుకు అలవాటు పడి ఉన్నారని , ప్రస్తుతం దళిత బంధు తో కేసీఆర్ చేస్తున్నది ఇదేనని . దళితుల సంక్షేమం విషయంలో కేసీఆర్ కు ఏ మాత్రం చిత్త శుద్దిలేదని కృష్ణసాగర్ రావు దుయ్యబట్టారు .
నిజంగా కేసీఆర్ కు దళితుల మీద చిత్త శుద్ధి ఉంటే దళిత సాధికారతకు ,దళితుల సంక్షేమానికి వారు ఏం చేశారో చెప్పాలని, దళితుల మూడు ఎకరాల భూమి ఇస్తానన్న హామీ ఇప్పటికీ నెరవేర్చలేదని. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, లక్ష ఉద్యోగాలు,కేజీ టూ పీజీ ఉచిత విద్య అనే హామీలు ఏమయ్యాయి..? అని ప్రశ్నించారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన చెప్పిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని. అలాంటి వ్యక్తిని ప్రజలు నమ్మరని విమర్శించారు .
దళిత బంధు లాంటి భారీ పథకాన్ని సీఎం కేసీఆర్ ఎప్పటికీ అమలు చేయలేరని ఇది కేవలం హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసం చేస్తోన్న డ్రామా అన్నారు .ఒక వైపు రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీస్తుంటే ఎన్నికల్లో గెలుపు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతున్నారని, కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితే అందుకు ఉదహారణ అని అన్నారు.
తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ మాయలో పడొద్దని ఆయన ఎన్నికల తాయిలాలకు లొంగొద్దని బీజేపీ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుందని.