అయిపాయే.. కాంగ్రెస్ పార్టీకి కష్టమే.. ఆజాద్ కీలక వ్యాఖ్యలు..

కాంగ్రెస్ పార్టీపై సొంత పార్టీ సీనియర్ నేతలే నమ్మకం పెట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే దేశంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయింది. మరోవైపు యూపీఏ ఎక్కడుంది అంటూ ఇటీవల టీఎంసీ అధినేత్రి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ అయోమయంలో పడిపోయింది. ఇదిలావుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

బుధవారం నాడు జమ్ములోని పూంచ్‌లో ఓ ర్యాలీలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో గులాం నబీ ఆజాద్‌ ప్రసంగించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 300 సీట్లు సాధించడం అసాధ్యమని అర్ధమవుతోందని అన్నారు. దీంతో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమే అన్నట్లు సొంతపార్టీ సీనియర్‌ నేత వ్యాఖ్యలతో అలజడి మొదలైంది. 300కు పైగా సీట్లు రావాలని తాను కోరుకుంటున్నానని.. కానీ అది అసాధ్యమని అన్నారు. ఆర్టికల్ 370పై ఏన్నో ఏళ్లునుంచి తానొక్కడినే మాట్లడుతున్నానని.. కానీ ఇప్పుడు ఆ అంశం కోర్టు పరిధిలో ఉందని.. దీంతో తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని గులాం నబీ ఆజాద్‌ అన్నారు. ఆర్టికల్370 రద్దుపై వెనక్కి వెళ్లేందుకు బీజేపీ రెడీగా లేదని… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం కూడా లేకపోవడంతో ఆర్టికల్ రద్దుపై తాను ఎలాంటి హామీ ఇవ్వలేనన్నారు.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *