పోలిటికల్ వాయిస్ : ఉత్తరప్రదేశ్ ఎన్నికల ముంగిట ములాయం కుటుంబంలో ముసలం చెలరేగింది. ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడులు అపర్ణ యాదవ్ బీజేపీ లో చేరింది. నరేంద్రమోడీ , యోగీ ఆదిత్యనాధ్ ల నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ అభివృద్ది మార్గంలో పయనిస్తోందని, అభివృద్దికి ఆటంకం కలగకుండా ఉండాలనే బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు .
ఎన్నికల ముందు అధికార బీజేపీ నుంచి మంత్రులు ,ఎమ్మెల్యేలను సమాజ్ వాది పార్టీలోకి చేర్చుకుని బీజేపీకి ఝలక్ ఇస్తే, ఏకంగా ములాయం ఇంటి కోడలిని బీజేపీ లోకి చేర్చుకుని అఖిలేశ్ కు పెద్ద షాక్ ఇచ్చింది .