హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ గా సీనియర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ను కేసీఆర్ సర్కారు నియమించింది. నిజామాబాద్ రూరల్ శాశనసభ్యుడిగా ఉన్న బాజిరెడ్డి కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు.
సిరికొండ మండల రావుట్ల కు చెందిన బాజిరెడ్డి గోవర్దన్ తొలుత 1999 లో ఆర్మూర్ ఎమ్మెల్యేగా, 2004 లో బాన్సువాడ నుంచి 2014,2018 నుంచి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవలే ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ ను ఆర్టీసీ ఎండీగా నియమించిన విషయం తెలిసిందే.