పొలిటికల్ వాయిస్,నవంబర్ 27,2023: ఈ ఐదేళ్లు ప్రజా సమస్యలను పట్టించు కోకుండా కెసిఆర్ పంచన చేరిన మాట వాస్తవం కాదా..?
కెసిఆర్ తమ పార్టీ అభ్యర్థులకు బి ఫామ్స్ ఇచ్చేవరకు సిపిఐ- బిఆర్ఎస్ పొత్తు ఉంటుందేమో అని ప్రగతి భవన్ గేటు వద్ద వాచ్మెన్ డ్యూటీలు చేసింది సిపిఐ నాయకులు కాదా…
మీ స్వార్దం కోసం సిద్దాంతాలు మరిచితివి.నిబంధనలను పాతరేస్తివి.ఆత్మగౌరవం మొత్తం కార్పోరేట్ వ్యవస్థలకు తాకట్టు పెట్టితివి…
ఒకే ఒక్క కొత్తగూడెం సీటు కోసం ఆత్మగౌరవం మొత్తం అమ్ముకుంటివి..
మునుగోడులో జేబులు నింపుకుని కేసీఅర్ పంచన చేరితివి..
అనంతరం మీ బలం తెలుసుకుని పెద్దాయన జాడిచ్చి తన్నితే…గత్యంతరం లేకా ఢిల్లీ పార్టీకి దాసోహమంటివి..
అయ్యా..కూనంనేని సాంబశివరావు గారు ఒక్కసారి మీరు ఆత్మ విమర్శ చేసుకోండి…
మధిర లో పంట నష్టం జరిగితే..రైతుల పక్షాన మీ పోరాటం లేకపోగా…కేసీఅర్ వస్తే రెడ్ కార్పెట్ పరిచినవ్.. గులాబీ శ్రేణుల కంటే మొత్తం పెత్తనం నువ్వే చేసినవ్.పోనీ.. ఏమైనా బాధితులకు పంట నష్టం ఇప్పించావా అంటే ఇంతవరకు అతీగతీ లేదు.నీ వ్యక్తిగత స్వార్థం కోసం చేసిన పైరవీలు తప్పా…తమ కోసం పోరాడిన పరిస్థితి లేదనే విషయంన్ని మాకు ఆలస్యంగా బోధపడింది.
కొత్తగూడెంలో మీరు ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి అంటే రామవరం బ్రిడ్జి..ఆఖరికి ఆ బ్రిడ్జి కూడా మీ స్వార్థ ప్రయోజనాల కోసం నిర్మాణం జరిగిందని తెలుసుకోలేని అమాయకత్వం మాది..
ఆర్. ఆర్ చికెన్ సెంటర్ వద్ద డౌన్ కావాల్సిన బ్రిడ్జిని…నీ వ్యాపారం కోసం అంటే నీకు చెందిన భారత్ స్కూల్ రోడ్డు కోసం ఎక్కడ ఎండ్ చేశారో ఇది కూడా ఆలస్యంగా మాకు బోధపడింది..
ఆ బ్రిడ్జిలో నాణ్యత అది కుంగినప్పుడే మాకు తెలిసింది..
సీపీఐ అంటే..అందులోనూ సాంబశివరావు అంటే ప్రజల పక్షం కాదు…డబ్బు పక్షం..
చివరిగా సాంబశివరావు గారు మీరు తెలుసుకోవాల్సిన ఒక నిజం కొత్తగూడెం నియోజకవర్గంలో పోటీ చేయడం మీ నాయకులకే ఇష్టం లేదు.. అందుకనే మీరు ఎప్పుడైతే పోటీ చేస్తున్నానని చెప్పారో అప్పటినుంచి ఇప్పటివరకు మీ పార్టీలో ఉన్న ప్రజా ప్రతినిధులు మీ షాడో పార్టీ అయిన వంటి బిఆర్ఎస్ లోకి అందరూ వెళ్తున్నారు…
నీకు తెలియని నిజం ఇంకొకటి ఉంది నీ పక్కన తిరిగే నీ రైట్ లెఫ్ట్ అని చెప్పుకుంటావే ఆ మనసే నీ ఓటమిని ప్రధానంగా కోరుకునేది ఇప్పటికే మీ ఏ టీం పార్టీ నుండి భారీగా ఆ వ్యక్తికి ప్యాకేజీలు అందాయి ఇది కొత్తగూడెం ప్రజలందరికీ తెలుసు నీకు ఒక్కరికి తప్ప…
మేము మీలా ఆత్మగౌరవం అమ్ముకునే స్థితికి దిగజారలేదు…ఎవడో విసిరిన ఎంగిలి ఇస్తరాకులు ఆశపడి,కక్కుర్తి పడి అమ్ముడు పోము..
ఇట్లు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు..