భువనగిరి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహ స్వామిని దర్శించుకున్నారు. కేంద్రమంత్రిగా తొలిసారి తెలంగాణకు వచ్చిన ఆయన జన ఆశీర్వాద్ యాత్రలో భాగంగా రాత్రి భువనగిరిలో భస చేశారు . ఈ ఉదయం స్వామివారిని దర్శించుకున్న తర్వాత యాత్ర ప్రారంభం అయ్యింది. జిల్లా అద్యక్షుడు, ఇతర నాయకులతో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు . ఆలయ మర్యాదలతో అర్చకులు కేంద్రమంత్రికి స్వాగతం పలికారు. అనంతరం వేదమంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు .

యాదగిరి గుట్ట నుంచి భువనగిరికి చేరుకుని అక్కడ అల్పాహరం తీసుకున్న అనంతరం నేరుగా ఘట్కేసర్ చేరుకున్నారు . ఘట్కేసర్ లో కిషన్ రెడ్డి నాయకులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.
