హై అలర్ట్‌.. పఠాన్‌కోట్‌ ఆర్మీ బేస్‌ క్యాంప్‌ వద్ద పేలుడు..

పఠాన్‌కోట్‌ ఆర్మీ క్యాంపు వద్ద పేలుడు కలకలం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున ధీర్‌పుల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. త్రివేణి గేటుకు సమీపంలో దుండగులు గ్రేనేడ్‌లు విసిరినట్లు తెలుస్తోంది. దీంతో చెక్‌పోస్టుల వద్ద హైఅలర్ట్ ప్రకటించారు. ప్రత్యేక బలగాలను మొహరించి.. తనిఖీలు ముమ్మరం చేశారు. అయితే పెళ్లి ఊరేగింపు ఒకటి ఆ ప్రాంతం నుంచి వెళ్తున్న సమయంలో బైక్‌పై నుంచి వచ్చిన దుండగులు త్రివేణి గేటు దగ్గర గ్రేనేడ్‌లను విసిరినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని.. ఘటనాస్థలి నుంచి గ్రేనేడ్‌ అవశేషాలను గుర్తించి.. స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *