నాట్యం కోసం తపించే మనసు ఆమెది. నాట్యమే ఆమె ఊపిరి. కీర్తిప్రతిష్ఠతల కోసం పరుగులు తీసే మనస్తత్వం కాదు. కళకు అంకితమైన జీవితంలోంచి తొంగిచూడలేని, లోతైన పరిశోధన ద్వారా భరతనాట్యంలో ఎన్నో కార్యక్రమాలను ఆవిష్కరించిన ఘనత ఆమెకుంది. నాట్యంలో సాంకేతిక అంశాలను అలవోకగా జోడించి, మన సొంపుగా ప్రదర్శనలు ఇస్తుంటే సంప్రదాయ కళలో ఇంత పరిజ్ఞానం దాగుందా అని అనిపించక తప్పదు. ఆమే ఆర్.కె పురం లో నివాసం ఉంటున్న శ్రీ శరత్ కుమార్ నోమిక ల ముద్దుల పుత్రిక గుల్లపల్లి శ్రీహసిని. భరతనాట్యంలో అటు అకడమిక్‌గా ఇటు ప్రొఫెషనల్‌గా ఏకకాలంలో రాణిస్తున్నారు.
చిన్నవయసులోనే భరతనాట్యంపై మక్కువ ఉన్న ఆమె అఆఇఈలతో పాటు బుడిబుడి అడుగులతో తకిటతకిటను కూడా నేర్చుకున్నారు. ఆమె నృత్యాన్ని ప్రసిద్ధ భరతనాట్య గురువులైన సంయుక్త అధికారి, వైష్ణవి వాసు, శ్వేతా వంటి కళాకారుల వద్ద జంకేర్ డాన్స్ స్కూల్లో నేర్చుకున్నారు.
కీర్తి ప్రదర్శనల్లో భక్తి పారవశ్యంతో పాటు ప్రేమ, అభిమానం, మనసు లోతుల్లోకి చొచ్చుకునిపోయే అభినయం ఆమె సొంతం. ఎక్కడ భరతనాట్య మహోత్సవాలు జరుగు తున్నా తప్పనిసరిగా ఆమె ప్రదర్శన ఉండి తీరాల్సిందే.
ఆమె ప్రదర్శన ఉందంటే చాలు ప్రేక్షకులు అమితాసక్తితో వస్తారు. కీర్తికి ఎక్కువ పేరు తెచ్చిపెట్టిన నృత్యం హరిగిరి నందిత. అనే పాటకి ఇచ్చిన ప్రదర్శన. ఆమెకు దుర్గాదేవి అంటే అమితమైన ప్రేమ, భక్తి. అందుకే తన నాట్యంలో అణువణువునా దేవిపై అల్లుకున్న ప్రేమ, అభి మానం, ఆకాంక్షలను అభి నయం ద్వారా వ్యక్తం చేస్తుంటారు.
ప్రేక్షకులను మైమరిపించేందుకు కారణం కూడా ఇదే. లయబద్దంగా, అడుగులో అడుగు వేస్తూ, విరహవేదనను అభివ్యక్తం చేస్తూ, నాట్యం చేస్తూ, చూపరుల మనసు దోచుకోవడం ఆమెకు బాగా తెలిసిన విద్య. కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడం కూడా మరిచిపోయేలా ఆమె ప్రదర్శన ఉంటుందంటే అర్థం చేసుకోవచ్చు ఆ కళలో ఆమె ఎంతగా పాతుకునిపోయారో.
నాట్య కళాశాలల్లో బోధకురాలిగా కూడా పనిచేస్తు న్నారు. రానున్న కాలంలో భరతనాట్యంకు మరింతగా సేవ చేసి, అనేకులను నాట్యకళాకారులుగా తీర్చిదిద్దడమే తన జీవితధ్యేయంగా భావిస్తున్న కీర్తి ఆశయాలు ఫలించాలని మనమూ ఆశిద్దాం…