హుజూరాబాద్ లో న‌వంబ‌ర్ రెండునే దీపావ‌ళి రాబోతోంది, టీఆర్ఎస్ కు బుద్ది చెప్ప‌డానికి ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు- బండి సంజ‌య్

హుజూరాబాద్ నియోజకవర్గంలోని హుజూరాబాద్ మండలంలోని తుమ్మనపల్లి గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు…..
• రబ్బర్ చెప్పులు…జీన్స్ ప్యాంట్ గాళ్లు ఏం చేస్తరని అన్న వాళ్ల బాక్సులు బద్దలు చేసిన చరిత్ర ఇక్కడి యువతది.
• 30న జరిగే పోలింగ్ నాడు పువ్వు గుర్తుపై ఓటేసి బీజేపీకి గెలిపించాలి.
• దీపావళి హుజూరాబాద్ ప్రజలకు రెండ్రోజుల ముందే వస్తోంది. వచ్చేనెల 2న వెల్లడయ్యే ఫలితాలతో ముందే పండుగ చేసుకోబోతున్నరు.
• టీఆర్ఎసోళ్లు ఒక్కో ఓటుకు రూ.20 వేలు ఇస్తున్నరు. తప్పకుండా తీసుకోండి. ఆ పైసలు మనవే. పువ్వు గుర్తుకే ఓటేయండి.
• ఈ గ్రామానికి ఉపాధి హామీ పని కింద రూ.1.20 కోట్లు, మౌలిక సదుపాయాల కోసం రూ.76 లక్షలు, మొక్కల కు రూ.45 లక్షలు, ఆర్దిక సంఘం రూ.78 లక్షలు, మరుగుదొడ్ల కోసం రూ.14 లక్షలు, స్మశాన వాటిక కోసం రూ.11,13,700 లు, పల్లె ప్రక్రు…
హుజూరాబాద్ మండలంలోని కందుగుల గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు….
• టీఆర్ఎసోళ్లు ఓటుకు రూ.20 వేలు ఇస్తామని దొంగ నోట్లు ఇచ్చే ప్రమాదం ఉంది. అన్నీ కరెక్టుగా ఉన్నాయో లేదో చూసుకోండి.
• ఇప్పటికే అసెంబ్లీలో బీజేపీ కేసీఆర్ కు డబుల్ ఆర్ సినిమా చూపించినం. వచ్చే నెల నుండి ప్రగతి భవన్ లో కేసీఆర్ కు ట్రిపుల్ ఆర్ సినిమా చూపిస్తం.
• కందుగుల గ్రామానికి కేంద్రం ఉపాధి హామీ పథకం కింద రూ.1.24 కోట్లు, మౌలిక సదుపాయాల కోసం రూ. 93 లక్షలు, మొక్కల పెంపకానికి రూ.23 లక్షలు, ఆర్దిక సంఘం 1.19 కోట్లు, మరుగుదొడ్లకు రూ.10 లక్షలు, స్మశాన వాటికకు రూ.11 లక్షలు, డంప్ యార్డుకు రూ.2 లక్షలు, నర్సరీకి రూ.1లక్ష, రైతు వేదికకు రూ.10 లక్షలకుపైగా ఇచ్చింది.
• కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయో కేసీఆర్ ను నిలదీయండి. ఆ డబ్బుతో ఓట్లను కొనుగోలు చేయాలని చూస్తున్నడు.
• కేసీఆర్ మూర్ఖుడు. పేదోళ్లు కష్టపడుతున్నా, చస్తున్నా మానవత్వం లేదు.
• హైదరాబద్ లో వరదలొచ్చినా, ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగులు, రైతులు చస్తున్నా పట్టించుకోని కేసీఆర్ పెద్దోళ్లు చనిపోతే మాత్రం వెళ్లి బోకే పెట్టి ఫోటోలకు ఫోజులిస్తున్నరు.
• పేదోళ్లకు అన్యాయం జరుగుతోంది. వారికి న్యాయం జరగాలని 1400 మంది చనిపోతే తెలంగాణ వస్తే….పేద్దోళ్లు రాజ్యమేలుతున్నరు.
• శ్రీకాంతాచారి, పోలీస్ కిష్టయ్య, సుమన్ సహా ఎందరో యువత ‘ మేం చచ్చిపోతేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. ఉద్యోగాలొస్తాయి’ అని బలిదానం చేసిండ్రు.
• కేసీఆర్ కుటుంబం చేసిన త్యాగమేంది? 1400 మంది చనిపోతే కేసీఆర్ కుటుంబం రాజ్యమేలుతోంది.
• ఎక్కడికి పోయినా పైసలు చల్లి ఓట్లు కొనే యత్నం చేస్తున్నరు.
• ఈటల రాజేందర్ కష్టపడి పనిచేసిండు. కోవిడ్ సమయంలోనూ ఆసుపత్రులకు వెళ్లి ప్రజలకు భరోసా కల్పించిండు. కుటుంబ సభ్యులున్నా జనమే ముఖ్యమని కరోనా కష్టకాలంలోనూ పేదలను కాపాడాలని పనిచేసిన వ్యక్తి ఈటల రాజేందర్.
• ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్య సదుపాయాలు ఎందుకు కల్పించడం లేదు? ఇంటికో ఉద్యోగం…దళిత సీఎం, దళితులకు మూడెకరాలు, నిరుద్యోగ భ్రుతి, రుణమాఫీ ఎందుకు అమలు చేయడం లేదని ఈటల రాజేందర్ ప్రశ్నిస్తే…..టీఆర్ఎస్ నుండి బయటకు పంపారు.
• కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయింది. డబ్బును విదేశాలకు తరలించిండు. కేంద్రం నిధులిస్తే జల్సాలు చేస్తున్నరు.
• రేషన్ బియ్యం డబ్బులు కేంద్రానివే. కిలోకు రూ.20లు కేంద్రమిస్తే…..రేషన్ షాపుల వద్ద కేసీఆర్ ఫొటోలు పెట్టుకోవడం సిగ్గుచేటు.
• టాయిలెట్ల నిర్మాణానికి కేంద్రం డబ్బులిస్తున్నా….చివరకు టాయిలెట్ల వద్ద కూడా కేసీఆర్ ఫోటోలు పెట్టుకోవడం సిగ్గుచేటు.
• కేంద్రం నిధులిస్తే….టీఆర్ఎస్ ఫొటోలు పెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నరు. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. పువ్వు గుర్తుకు ఓటేయండి. ఈటల రాజేందర్ ను గెలిపించండి.
• ఈటలను గెలిపిస్తేనే కేసీఆర్ అహంకారం దిగుతుంది. గడీల నుండి బయటకొస్తాడు. పేదల తరుపున కొట్లాడేది బీజేపీ మాత్రమే.
• 30న జరిగే ఎన్నికల్లో కులాలు, వర్గాలు, సంఘాలు, సంస్థల పేరుతో ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తున్నరు. మీరందరూ ఏకమై గంపగుత్తగా పువ్వు గుర్తుకు ఓటేయ్యాలి.
• హైదరాబాద్ లో వరదలొస్తే రూ.10 వేల రూపాయల సాయం నిలిపేసి బండి సంజయ్ లేఖ రాయడంవల్లే సాయం ఆగిపోయిందని కేసీఆర్ దొంగ లేఖ స్రుష్టించిండు. భాగ్యలక్ష్మీ అమ్మవారి వద్ద ప్రమాణం చేద్దాం రా…అని సవాల్ విసిరితే తోకముడిచిన వ్యక్తి కేసీఆర్.
• ఇప్పుడు కూడా బీజేపీ వల్లే దళిత బంధు ఆగిపోయిందని దొంగ మాటలు చెబుతున్నడు. 70 రోజులైనా ఇంతవరకు దళిత బంధు డబ్బులు పేదలకు ఎందుకు ఇవ్వడం లేదు? దొంగ లేఖ లు స్రుష్టిస్తున్నరు.
• దళిత బంధు పై యాదాద్రికి వచ్చి ప్రమాణం చేద్దాం…రా అని సవాల్ చేస్తే కేసీఆర్ నోరు మెదపడం లేదు.
• కందుగుల గ్రామంలో ప్రతి ఇంట్లో ఓటర్లంతా ఈటల రాజేందర్ కు ఓటేయాలి. మీ బంధు మిత్రులను కూడా పువ్వు గుర్తుకు కూడా ఓటేసేలా చేయండి.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *