బండి సంజ‌య్ పాద‌యాత్ర‌కు భారీగా ఏర్పాట్లు

హైద‌రాబాద్ : బీజేపీ రాష్ట్ర అద్య‌క్షుడు , క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ కుమార్ ఈ నెల 24 నుంచి చేప‌ట్ట‌బోతోన్న పాద‌యాత్ర‌కు భారీగా ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ. పాద‌యాత్ర ప్రారంభం అయ్యే ఛార్మినార్ భాగ్య‌ల‌క్ష్మి ఆల‌యం తో పాటు పాద‌యాత్ర జ‌రిగే రూట్లు, మ‌ద్యాహ్న భోజ‌న వ‌స‌తి, నీటి వ‌సతి, బహిరంగ స‌భ ఏర్పాట్ల‌ను నాయ‌కులు వెంక‌ట్ రెడ్డి , గౌతంరావు, మాజీ మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు త‌దిత‌రులు ప‌రిశీలించారు. మంగళవారం హైదరాబాద్, రంగారెడ్డి రూరల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని ప్రాంతాల్లో పాదయాత్ర కమిటీ సభ్యులు పర్యటించారు.
పాద‌యాత్ర ఎక్కువ గ్రామాల గుండా వెళ్లే విధంగా , జ‌న‌సమీక‌ర‌ణ తో పాటు పాద‌యాత్ర‌లో నిత్యం పాల్గొనే కార్య‌క‌ర్త‌ల కోసం వ‌స‌తులు ఇత‌ర అంశాల‌ను ప‌రిశీలించిన‌ట్టు నాయ‌కులు వెల్ల‌డించారు . ఈ పాద‌యాత్ర ద్వారా తెలంగాణ ప్ర‌జ‌ల్లో కేసీఆర్ చేస్తోన్న మోసాల‌ను ఎండ‌గట్టి , బీజేపీ ప్ర‌భుత్వ ఏర్పాటుకు పునాదిగా మార‌నుంని నాయకులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు .

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *