శంషాబాద్‌ నుంచి కువైట్‌కు బయలుదేరిన 44 మంది మహిళలు.. విచారిస్తే షాకింగ్‌ నిజాలు.. అరెస్ట్‌..

శంషాబాద్‌ నుంచి కువైట్‌కు బయలుదేరిన 44 మంది మహిళలను రాజీవ్‌ గాంధీ ఎయిర్‌పోర్ట్ పోలీసులు అడ్డుకున్నారు. వీరంతా నకిలీ వీసాలతో పాటుగా.. రెండేసి వీసాలు ఉన్నట్లు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ఏపీ, తమిళనాడు, గోవాకు చెందిన 44 మంది మహిళలు కువైట్‌ వెళ్లేందుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అయితే ఇమ్మిగ్రేషన్‌ అధికారులు చెకింగ్‌ చేస్తుండగా వీరిలొ కొందరు టెన్షన్‌ పడుతూ భయంతో ఉండిపోయారు. అది గమనించిన అధికారులు వెంటనే వారి వద్ద ఉన్న డాక్యుమెంట్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో పలు డాక్యుమెంట్లు సరిగ్గా లేకపోవడంతో అధికారులు లోతుగా విచారణ చేపట్టారు. దీంతో వీరంతా ఫేక్‌ వీసాలతో వెళ్తున్నట్లు గుర్తించారు. వీరంతా ఓ ట్రావెల్‌ ఏజెంట్‌ ద్వారా వెళ్తున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే సదరు ట్రావెల్‌ ఏజెంట్‌ ఫేక్‌ వీసాలతో ఇలాంటి పనులకు పాల్పడ్డారా..? లేక మహిళలు కూడా అక్రమంగా కువైట్‌ వెళ్లేందుకు ప్రయత్నించారా..? అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. సదరు 44 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు. వీరందరిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపడుతున్నారు. ఈ ఫేక్‌ వీసా దందాలో హైదరాబాద్‌, చెన్నైకి చెందిన కొందరు ట్రావెల్‌ ఏజెంట్స్‌ ఉండి ఉంటారని అనుమానిస్తున్నారు.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *