క్రైస్తవ, మహ్మదీయ సమాజాన్ని తానెప్పుడు విమర్శించనని స్వామి పరిపూర్ణానంద అన్నారు. హిందువులంటే మీకు గొర్రెల్లాంటి వారనే భావనను జగన్ సర్కార్ మార్చుకోవాలన్నారు. ఇక టీటీడీలో పింక్ డైమండ్ గురించి విషయాన్ని బయటపెటట్ఆలని.. నిరాషి వ్యవస్థలో ఉన్న వ్యక్తుల్ని మీరు ఉద్యోగులుగా మార్చారని.. అంటే వారంతా మీ కాళ్లు పట్టుకుని కూర్చోవాలా అని ప్రశ్నించారు. తిరుమలలో వెంకటేశ్వరుడే గొప్ప అని.. కోటిశ్వరుడు కాదని.. తిరుపతి దేవస్థానం స్వామివారిదే అని.. వకుళామాత గురించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించి మంచి ఆలయాన్ని నిర్మించారని.. దానికి మనసా,వాచా, కర్మణా అభినందిస్తున్నానని స్వామి పరిపూర్ణానంద అన్నారు. ఇక టీటీడీలో సేవల పేరుతో రుసుములను పెంచుతున్నారని.. అలా వచ్చిన ధనాన్ని వేరే వాటికి ఖర్చుచేస్తున్నారని.. అలా చేయొద్దన్నారు. ఆస్పత్రులు, విద్యాలయాలు, రోడ్లు నిర్మించాలంటే వేరే సొమ్ముతో పనులు చేయాలని..ఇలా టీటీడీ సొమ్ముతో నిర్మించమని ఆగమశాస్త్రంలో ఎక్కడా కూడా లేదని అన్నారు.