దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధర సెంచరీకి పైగానే ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా ధరలు మండిపోతున్న విషయం తెలిసిందే. అయితే ధరలు తగ్గించే విషయంపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పలు సూచనలు కూడా చేసింది. వ్యాట్ ధరలను తగ్గించుకుని వాహనదారులకు ఉపశమనం కల్గించవచ్చని పేర్కొంది. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటుగా ఒడిషా వంటి రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయి. అయితే తాజాగా జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి ప్రజలకు భారీ ఊరట కల్గించే ప్రకటన చేపట్టింది. సామాన్య ప్రజలకు ఇబ్బందులు తగ్గించేందుకు పెట్రోల్ ధరను లీటర్‌కు రూ.25 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇది కేవలం ద్విచక్ర వాహనాలకు వారికి మాత్రమే ఈ సదుపాయమని పేర్కొంది. దీనికి సంబంధించి హేమంత్ సోరెన్ ఓ ట్వీట్ చేస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలిపారు. అయితే ఈ తగ్గింపు ధరలు జనవరి 26వ తేదీ 2022 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.