ఇది పొగరా..? భయమా..? సెల్ఫీ దిగేందుకు యత్నించిన యువకుడిన దూషించిన కాంగ్రెస్ నేత

సెల్ఫీ.. ఇప్పుడు ప్రతి ఒక్కరు సెలబ్రిటీలతో కానీ.. రాజకీయ నాయకులతో కానీ దిగేందుకు ఉత్సహంతో ముందుకు వస్తుంటారు. అయితే ఈ క్రమంలో కొందరు సెలబ్రిటీలు వారి అభిమానులు సెల్ఫీ దిగేందుకు యత్నిస్తే చిరాకుతో చేయి చేసుకోవడం చూశాం. అయితే రాజకీయ నాయకులు మాత్రం ఎంతో హుందాగా అభిమానులకు ఫోటో దిగేందుకు అవకాశాలు ఇస్తూ.. వారి మనసులను చూరగొంటుంటారు. అయితే తాజాగా కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ చేసిన వ్యాఖ్యలు, ఆహాభావాలను చూస్తే.. రాజకీయ నాయకులు పొగరుతో ఉంటారా..? లేదా భయంతో ఉంటారా..? అన్న అనుమానాలను రేకెత్తిస్తోంది. మాండ్యాలో బుధవారం నాడు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా ఉన్న డీకే శివకుమార్‌ ఓ వ్యక్తిని దూషిస్తూ క్లాస్‌ తీసుకున్నారు. డీకే శివకుమార్‌తో సెల్ఫీ దిగేందుకు సదరు వ్యక్తి ప్రయత్నించడమే ఇందుకు కారణం. ఆయన వెనుకనుంచి వచ్చి సెల్ఫీ దిగేందుకు యత్నించాడు. దీంతో వెంటనే సదరు వ్యక్తి చేతిని పట్టుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు కాస్త దూషణలకు కూడా దిగారు. అనంతరం జరిగిన ఘటన వీడియో వైరల్‌ అవ్వడం.. అదే సమయంలో దానిని కవర్‌ చేసేందుకు చేసిన వ్యాఖ్యలు చూస్తే డీకే శివకుమార్‌ పొగరుతో ఉన్నారా..? లేక భయంతో ఉన్నారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజీవ్‌ గాంధీకి ఏం జరిగిందో మీకు తెలుసు కదా..? ఏవరి చేతిలో ఏం ఉందో ఏం తెలుసు..? కొన్ని సందర్భాల్లో మనుషుల్లో కోపం, ఆగ్రహం, భావోద్వేగాలు బయటకు వస్తాయి. వాటిని తప్పుపట్టలేమంటూ డీకే శివకుమార్‌ అన్నారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *